ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రతి ఒక్కరి చూపు ఏపీ ఎన్నికలపై పడింది. ఏపీలో మరో మూడు నెలల ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్ర రాజకీయాలపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
అయితే ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ తరపున కొద్దిరోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అయితే తాజాగా ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ ఈయన రాజకీయాలపై ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారని అయితే రాజకీయాలకు సంబంధించిన విషయాలను తన సన్నిహితుల దగ్గర మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎన్టీఆర్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ రాజకీయాలను భాగం విశ్లేషిస్తారని తెలుస్తుంది. గతంలో ఈయన తమిళనాడులో డిఎంకె పార్టీ వస్తుందని మాటల సందర్భంలో తెలియజేశారట అయితే ఎన్టీఆర్ చెప్పిన విధంగానే తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది
అదేవిధంగా గత తెలంగాణ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ ఎన్టీఆర్ చెప్పారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ చెప్పిన విధంగానే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు ఏపీ ఎన్నికల గురించి తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ 2024 లో జరగబోయే ఎన్నికలలో తప్పకుండా ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ ఎన్టీఆర్ తెలియజేశారట. దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
మరి ఎన్టీఆర్ చెప్పిన విధంగానే ఏపీలో 2024లో తెలుగుదేశం పార్టీ తిరిగే అధికారంలోకి వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉంది కనుక ఏపీలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. కనుక ఈ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!