Jr NTR, Koratala Siva: తారక్ కు బాలీవుడ్ బ్యూటీ ఫిక్సైందా?

  • August 19, 2021 / 10:05 PM IST

రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీలో కియారా అద్వానీ ఫిక్స్ కావడంతో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో హీరోయిన్ ఎవరనే చర్చ ప్రేక్షకుల మధ్య జరుగుతోంది. అలియా భట్, కియారా అద్వానీల పేర్లు ప్రధానంగా వినిపించగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ నటించిన సంగతి తెలిసిందే.

సాహో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో శ్రద్ధా కపూర్ కు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం శ్రద్ధా కపూర్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో హీరోయిన్, ఇతర టెక్నీషియన్లకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయని తెలుస్తోంది.

జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్, కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుండగా పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుండటంతో కొరటాల శివ శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారని సమాచారం. శ్రద్ధా కపూర్ సాహోతో సక్సెస్ అందుకోలేకపోయినా కొరటాల శివ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ రానుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus