రాజమౌళి ఎన్టీఆర్ కి మళ్ళీ ఆ రేంజ్ హిట్ ఇవ్వలేకపోయారు

  • July 11, 2020 / 10:00 AM IST

సింహాద్రి మూవీ 17ఏళ్ల పండుగను ఘనంగా ముగించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. దాదాపు 9మిలియన్స్ ట్వీట్స్ తో టాప్ లో ట్రెండ్ చేశారు. ఓ యజ్ఞంలా రోజంతా పనిచేసి…తమ అభిమానాన్ని చాటుకున్నారు. సింహాద్రి మూవీ వసూళ్ల రికార్డులు, ఆడిన రోజులు, సెంటర్స్ సంఖ్య వంటి విషయాలతో ట్వీట్స్ వేస్తూ ఎన్టీఆర్ గొప్పతనాన్ని, అతి చిన్న వయసులో సాధించిన ఘనతను చాటిచెప్పారు. ఐతే ఈ పదిహేడేళ్లలో ఎన్టీఆర్ మళ్ళీ అలాంటి హిట్ సాధించలేదు.

ఎన్టీఆర్ రాజమౌళితో మూడవ చిత్రంగా యమదొంగ చేశారు. ఆ మూవీ ఎన్టీఆర్ ని ప్లాప్ లనుండి బయటపడేసి మంచి విజయాన్ని అందుకుంది. ఐతే సింహాద్రి వలే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కాదు. ఇక ఎన్టీఆర్ కి మరే దర్శకుడు ఆ స్థాయి హిట్ ఇవ్వలేకపోయారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఆది, సింహాద్రి మినహాయిస్తే బ్లాక్ బస్టర్స్ లేవు. ఆయన ఖాతాలో హిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నారు.

మరి ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ అందుకుంటారేమో చూడాలి. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టినా సోలోగా ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్ళదు. రామ్ చరణ్ కూడా నటిస్తుండగా ఆయనకు కూడా హిట్ లో భాగంగా ఉంటుంది. కనుక ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత త్రివిక్రమ్ మరియు ప్రశాంత్ నీల్ పై ఉంది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus