Jr NTR: తారక్ దీక్ష వెనుక అసలు కారణాలివేనా?

స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరో రెండు నెలల తర్వాత తారక్ కొత్త సినిమా షూటింగ్ మొదలు కానుంది. కొత్త సినిమా కోసం తారక్ ఎనిమిది కిలోల బరువు తగ్గనున్నారు. సినిమాకు అనుగుణంగా లుక్ ను మార్చుకుంటున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే తారక్ తాజాగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారని తెలుస్తోంది.

Click Here To Watch Trailer

సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి దీక్షలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే చరణ్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ మారారని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. భక్తి మార్గంపై దృష్టి పెట్టిన ఎన్టీఆర్ 21 రోజుల పాటు ఆంజనేయ స్వామి దీక్ష చేపట్టనున్నారు. ఆర్ఆర్ఆర్ విజయం కూడా ఎన్టీఆర్ దీక్ష చేపట్టడానికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్టర్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తన తర్వాత సినిమాలకు పాన్ ఇండియా డైరెక్టర్లు పని చేసే విధంగా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. తారక్ భవిష్యత్తు సినిమాలు సైతం ఘనవిజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భవిస్తున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులలో తారక్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ త్వరగా మొదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని ప్రస్తుతం తారక్ ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల నుంచి 70 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ తో సినిమాలను తెరకెక్కించడానికి, నిర్మించడానికి దర్శకనిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. తారక్ సినిమాల విషయంలో మరింత వేగం పెంచాలని అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమాగా కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus