Jr NTR, Rajamouli: అదే కానీ జరిగితే రాజమౌళిని చంపేస్తారేమో: ఎన్టీఆర్

  • April 8, 2022 / 06:20 PM IST

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’.. చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ళు సాధిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను సాధించింది. త్వరలోనే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో చిత్ర బృందం కూడా ముంబైలో సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి కూడా ‘బాహుబలి’ లా సీక్వెల్ ఉంటుందా? అంటూ దర్శకుడు రాజమౌళిని పదే పదే ప్రశ్నిస్తున్నారు విలేకర్లు. వీటికి రాజమౌళి ఆ టైంకి ఏది అనిపిస్తే అది చెబుతున్నాడు. కొన్నిసార్లు చూద్దాం అంటాడు, ఇంకొన్ని సార్లు హీరోలు డేట్లు ఇవ్వాలి కదా అంటాడు. ఇలా ఏదో ఒకటి చెప్పేసి మాట దాటేస్తున్నాడు.

అయితే ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్ స్పందించాడు. ‘ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కి చాలా మంది సీక్వెల్‌ కావాలని అడుగుతున్నారు. మాక్కూడా సీక్వెల్ చేస్తే బాగుణ్ణు అనిపిస్తుంది.అయితే అది పూర్తిగా మన రాజమౌళి ఇష్టం. రాజమౌళి కనుక సీక్వెల్‌ తీయకపోతే మీరందరూ ఆయన్ని చంపేసేలా ఉన్నారు. ఆయన కచ్చితంగా ‘ఆర్.ఆర్.ఆర్’ కి ఇంకో పార్ట్ తీస్తారు అని ఆశిద్దాం’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు.అలాగే ‘హీరోలు డేట్లు ఇవ్వాలి కదా అని ఆయన మా మీదకి తోసేస్తున్నాడు.

మేము రాజమౌళితో పనిచేయడానికి ఎప్పుడూ రెడీనే’ అంటూ ఫన్నీగా స్పందించారు ఎన్టీఆర్. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటించిన సంగతి తెలిసిందే.మరో హీరో రాంచరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటించాడు. ఎన్టీఆర్ సరసన జెన్నీ పాత్రలో ఒలీవియా మోరిస్ నటించగా, చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్ నటించింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus