Jr NTR, Nagarjuna: బిగ్ బాస్ సెగను తారక్ ఎలా తట్టుకుంటారో?

  • September 6, 2021 / 01:56 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో గత రెండు వారాల నుంచి ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. వీక్ డేస్ లో ఈ షో ప్రసారమవుతూ ఉండటంతో ఈ షోకు రేటింగ్స్ ఆశించిన స్థాయిలో లేవనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ షోకు గరిష్టంగా వచ్చిన టీఆర్పీ 11.37 కాగా రాబోయే రోజుల్లో ఈ స్థాయి రేటింగ్ ను రాబట్టడం తేలిక కాదనే సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఎంట్రీతో జెమినీ ఛానల్ మాత్రం చాలా రోజుల తర్వాత 400 మార్క్ జీఅర్పీని సొంతం చేసుకుంది.

మరోవైపు ఎన్టీఆర్ షోకు బిగ్ బాస్ షో నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. రెండు షోలు ప్రసారమయ్యే సమయాల్లో తేడాలున్నా బిగ్ బాస్ వీక్ డేస్ రేటింగ్ ను, ఎవరు మీలో కోటీశ్వరులు వీక్ డేస్ రేటింగ్స్ తో పోల్చి చూసే అవకాశం ఉంది. బిగ్ బాస్ సెగను ఎన్టీఆర్ తట్టుకోవాలంటే షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. బిగ్ బాస్ గత సీజన్లు బుల్లితెరపై సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

రాబోయే రోజుల్లో వీక్ డేస్ లో ఎవరు మీలో కోటీశ్వరులు, బిగ్ బాస్ షోలలో ఏ షో పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ షోకు మరి కొందరు ప్రముఖ సెలబ్రిటీలను ఆహ్వానిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవరు మీలో కోటీశ్వరులు షో డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రసారం కానుండగా బిగ్ బాస్ షో డిసెంబర్ మూడవ వారం వరకు ప్రసారం కానుందని తెలుస్తోంది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus