బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సరికొత్తగా ప్రారంభం అయ్యింది. స్టేజ్ పైన వెలుగు జిలుగుల్లో నాగార్జున హోస్ట్ గా దుమ్మురేపాడు. ఒక్కో పార్టిసిపెంట్ ని హౌస్ లోకి పంపిస్తూ హౌస్ కి తాళం పెట్టాడు. 106 రోజుల పాటు సాగే ఈ రియాలిటీషోలో మొత్తం 19 మంది పార్టిసిపెంట్స్ గా హౌస్ లోకి వెళ్లారు.

1. సిరిహన్మంత్

ఫస్ట్ కంటెస్టెంట్ గా యాంకర్ సిరిహన్మంత్ స్టేజ్ పైన సందడి చేసింది. తనదైన స్టైల్లో డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో దుమ్మురేపింది. ఇక యాంకర్ గా యాక్టర్ గా సిరి హన్మంత్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలే. అంతేకాదు, యూట్యూబ్ లో కూడా సిరి హన్మంత్ కి చాలామంది వ్యూవర్స్ కూడా ఉన్నారు.

2. విజె సన్నీ..

తెలుగు సీరియల్స్ చూసే ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే, బుల్లితెర హీరోగా సన్నీ చాలా ఫేమస్. కళ్యాణ వైభోగమే సీరియల్ చూసే వారికి చాలా ఇష్టమైన హీరో. ఖమ్మంలో పుట్టిన విజె సన్నీ ఫస్ట్ లో మా మ్యూజిక్ ఛానల్ లో వీడియో జాకీగా పనిచేశాడు. అప్పట్నుంచీ విజె సన్నీగా అందరికీ సుపరిచితుడు అయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 లో ఎలాంటి హంగామా చేస్తాడు అనేది చూడాలి.

3.లహరీ షరీ..

అర్జున్ రెడ్డి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా కూడా అందరికీ బాగా గుర్తుండి పోయింది లహరి.
ఈ సినిమాతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత మహా టీవి ఛానల్ లో కొన్నాళ్లు న్యూస్ రీడర్ గా వర్క్ చేసింది. లహరి షరీ పేరుమీద చాలామంది ఫ్యాన్ గ్రూప్స్ కూడా అప్పుడే పుట్టుకొచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ నెంబర్ త్రీగా ఎంట్రీ ఇచ్చింది.

4. శ్రీరామచంద్ర..

ప్లే బ్యాక్ సింగర్ గా తెలుగులో చాలా పాపులర్. అంతేకాదు, ఇండియన్ ఐడియల్ సీజన్ 5 విన్నర్ గా శ్రీరామచంద్రని బాలీవుడ్ ప్రేక్షకులు సైతం గుండెల్లో పెట్టుకున్నారు. 8 యేళ్ల వయసులోనే తన గాత్రంతో శ్రోతల హృదయాలని గెలుచుకున్నాడు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ స్టేజ్ షోలు, సింగింగ్ కాంపిటేషన్స్ ఇస్తూ తనకంటూ ఒక ప్ర్తత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో నెంబర్ 4 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీరామ్ చంద్ర.

5. అనీ మాస్టర్…

డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న అనీ మాస్టర్ కొరియోగ్రాఫర్ కేటగిరిలో బిగ్ బాస్ 5 హౌస్ లోకి 5వ పార్టిసిపెంట్ గా అడుగుపెట్టారు. డ్యాన్సర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన అనీ మాస్టర్ అంచలంచెలుగా కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. అనీ మాస్టర్ అసలు పేరు అనిత లామ. 1995 హైదరాబాద్ లో జన్మించింది. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో డ్యాన్సర్ గా వర్క్ చేసింది. అనీ మాస్టర్ వాళ్ల నాన్నగారు ఆర్మీలో వర్క్ చేసేవారు. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ పైన మక్కువతో ఎన్నో డ్యాన్స్ షోలలో కూడా పార్టిసిపేట్ చేసింది. నటరాజ్ మాస్టర్ దగ్గర కూడా అనీమాస్టర్ అసిస్టెంట్ గా వర్క్ చేయడం విశేషం.

6. లోబో..

లోబో అసలు పేరి మహ్మద్ ఖయ్యుం. చిన్నప్పటినుంచీ తనకి సినిమాలు అంటే మక్కువ ఎక్కువ. ట్యాటూవాలాగా హైదరాబాద్ లో బాగా ఫేమస్. అంతేకాదు, మా మ్యూజిక్ లో తన యాంకరింగ్ కి అప్పట్లో ఫ్యాన్స్ కూడా ఉండేవాళ్లు. 19యేళ్ల వయసులో ఇంట్లోనుంచీ పారిపోయి ముంబై ట్రైన్ ఎక్కాడు. తన ఫేవరెట్ హీరోయిన్ కాజోల్ ని కలవడానికి ముంబైలో చాలా కష్టాలు పడ్డాడు. కానీ, కలవలేకపోయాడు. ఆతర్వాత గోవాలో కొన్నేళ్లు ట్యాటూ వేయడంలో శిక్షణ తీస్కున్నాడు. తనమార్క్ చూసి ట్యాటూషాప్ ఓనర్ ఖయ్యుంకి లోబో అని నామకరణం చేశాడు. అప్పట్నుంచీ లోబోగా ఫేమస్ అయ్యాడు. హైదరాబాద్ వచ్చి ట్యాటూ షాప్ ని ఓపెన్ చేశాడు. ఆ తర్వాత మా మ్యూజిక్ లో చాలాకాలం యాంకర్ గా వర్క్ చేశాడు. అంతేకాదు, చాలాసినిమాల్లో ఆర్టిస్ట్ గా కూడా మెరిశాడు.

7. ఆర్టిస్ట్ ప్రియ..

తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని ఫేమ్ ఆమెది. చాలా సినిమాల్లో హీరోియన్ కి మదర్ గా, హీరోకి మదర్ గా నటించింది. అంతేకాదు, తెలుగు సీరియల్స్ చూసేవారికి చాలా సుపరిచితురాలు ప్రియ. ప్రియ అసలు పేరు మామిళ్ల శైలజాప్రియ. పుట్టింది పెరిగింది బాపట్లలో. బిగ్ బాస్ 5 లోకి 7వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ప్రియ.

8. జస్వంత్ జెస్సీ పడాల…

జెస్సీ అంటూ బిగ్ బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టాడు. మోడల్ గా, ర్యాంప్ వాక్ చేస్తూ తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఫేమస్ ఫ్యాషన్ మోడల్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయవాడలో పుట్టి అక్కడే తన కెరియర్ ని ప్రారంభించాడు. 2017లో మిస్టర్ ఎపి ట్రెడిషనల్ ఐకాన్ అవార్డ్ ని గెలుచుకున్నాడు. చెన్నైలో జరిగిన ఒక షోలో 36 గంటల పాటు సుమారు 250 మోడల్స్ తో కంటిన్యూస్ గా ర్యాంప్ వాక్ చేయించి గిన్నిస్ రికార్డ్ ని సైతం క్రియేట్ చేశాడు. అంతేకాదు, ఇప్పుడున్న బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ అందరిలోకంటే చిన్నవాడు జెస్సీనే.

9. ప్రియాంక సింగ్..

జబర్ధస్త్ షోలో సాయితేజ్ గా అందరికీ పరిచయం అయిన ప్రియాంక సింగ్ ఆతర్వాత జెండర్ ని మార్చుకుని అమ్మాయిగా మారింది. ఆ తర్వాత బాలకృష్ణుడు , మనసైనోడు అనే సినిమాల్లో కూడా వర్క్ చేసింది. 1995లో హైదరాబాద్ లో పుట్టిన ప్రియాంక సింగ్ కి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. వాళ్ల నాన్న ల్యాబ్ అటెండర్ గా వర్క్ చేసేవారు. అంతేకాదు, కొన్నాళ్లు ప్రియాంక అలియాస్ సాయితేజ్ ల్యాబ్ అటెండర్ గా కూడా వర్క్ చేశారు.

10. షణ్ముక్ జస్వంత్…

యూట్యూబ్ వీక్షకులకి అస్సలు పరిచయం అక్కర్లేని పేరు షణ్ముక్ ది. ముద్దుగా అందరూ షన్నూ అని పిలుచుకుంటారు. కవర్ సాంగ్స్ తో కెరియర్ ని స్టార్ట్ చేసి, వెబ్ సీరిస్ లో స్టార్ గా ఎదిగాడు షణ్ముక్ జస్వంత్. లాస్ట్ టైమ్ బిగ్ బాస్ సీజన్ 2 నుంచి షణ్ముక్ పేరు వినిపిస్తూనే ఉంది. రీసంట్ గా సూర్య వెబ్ సీరిస్ తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. విశాఖపట్నంకి చెందిన షణ్ముక్ బిబిఎం వరకూ చదివాడు.

11. హమీద.

హమీద రీసంట్ గా వచ్చిన ‘సాహసం చేయరా ఢింబకా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి మోడల్ గా చిన్న చిన్న యాడ్స్ లో కూడా వర్క్ చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో అడుగుపెట్టింది.

12. నటరాజ్ మాస్టర్..

ఆట – ఛాలెంజ్ షోలు చూసినవాళ్లు నటరాజ్ మాస్టర్ ని ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు నటరాజ్ మాస్టర్. నటరాజ్ మాస్టర్ సొంత ఊరు విజయవాడ. హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో నటరాజ్ మాస్టర్ హోటల్ లో వెయిటర్ గా పనిచేసేవారు. అక్కడ మాస్టర్ టాలెంట్ ని గుర్తించిన ప్రొడ్యూసర్ సత్యన్నారాయణ శ్రీహరి వైఫ్ అయిన శాంతిప్రియ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ చేయించారు. అక్కడ్నుంచీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో డ్యాన్స్ షోలలో పార్టిసిపేట్ చేశారు.

తర్వాత డ్యాన్స్ షోలకి జడ్జిగా కూడా వ్యవహరించారు మాస్టర్. వీధి అనే సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ గా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. అయితే, రీసంట్ గా కొన్ని కారణాలవల్ల గ్యాప్ తీస్కోవాల్సి వచ్చింది. మళ్లీ బిగ్ బాస్ సీజన్ 5 అనేది నటరాజ్ మాస్టర్ కి సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి.

13. సరయు..

7 ఆర్ట్స్ సరయుగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. యూట్యూబ్ లో చిన్న చిన్న స్కిట్స్ లో తనదైన లాంగ్వేజ్ ని మాట్లాడుతూ అందరిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ సీజన్ 5లో 13వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

14. విశ్వ..

ఆర్టిస్ట్ గా విశ్వ తెలుగు ప్రేక్షకులకి తెలిసిన ఫేస్ అనే చెప్పాలి. మోడల్ గా చిన్న చిన్న యాడ్స్ లో కూడా నటించాడు. అలాగే చాలా సినిమాల్లో ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. సీరియల్స్ చూసేవారికి కూడా బాగా సుపరిచితుడు.

15. ఉమాదేవి..

తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన ఆవిడే. రీసంట్ గా కార్తీకదీపం సీరియల్ లో అర్ధపావు భాగ్యంగ్ ఫేమస్ అయ్యింది. చిన్న చిన్న క్యారెక్టర్స్ లో ఎన్నో సినిమాల్లో కూడా నటించింది. పూరీజగన్నాధ్ బాచీ సినిమాలో తెలుగు తెరకి పరిచయం అయ్యింది ఉమాదేవి. భార్యాభర్తలు, వరూధిని పరిణయం, కళ్యాణ వైభోగమే సీరియల్స్ లో మంచి పేరుని తెచ్చుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5లో 15వ పార్టిసిపెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

16. మానస్.

మానస్ పూర్తి పేరు మానస్ నాగులపల్లి. మాస్టర్ రామ్ తేజ్ గా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చాడు. నర్సింహ నాయుడు మూవీతో చైల్డ్ ఆర్డిస్ట్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చిన్న బడ్జెట్ సినిమాల్లో కాయ్ రాజాకాయ్, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, ప్రేమికుడు, గోలిసోడా లాంటి సినిమాల్లో హీరోగా కూడా వర్క్ చేశాడు. తెలుగు సీరియల్స్ లో కూడా హీరోగా తనదైన మార్క్ ని వేసుకున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు మానస్.

17. కాజల్..

ఆర్జేగా, యూట్యూబర్ గా చాలా ఫేమస్ కాజల్. ఆర్జే కాజల్ అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. రీసంట్ తన యూట్యూబ్ ఛానల్ లో సెలబ్రిటీలని సైతం ఇంటర్య్వూస్ చేస్తూ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 లో 17వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది కాజల్.

18. శ్వేతావర్మ..

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంటోంది శ్వేతా వర్మ. ద రోజ్‌ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్‌, సైకిల్‌ సినిమాల్లో నటించింది. మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్న ఈ భామ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరం.

19. యాంకర్ రవి..

ప్రస్తుతం బిజీగా ఉన్న యాంకర్స్ లో రవి కూడా ఒకడు. స్టార్ మాలో ,జీతెలుగులో, అలాగే ఈటీవిలో ఎన్నో షోస్ ని లీడ్ చేస్తూ యాంకర్ గా చాలా పాపులారిటీని సంపాదించుకున్నాడు. స్టార్టింగ్ కెరియర్ లో యాంకర్ రవి కూడా స్టార్ మా మ్యూజిక్ ఛానల్ లో పనిచేసినవాళ్లలో ఒకడు. లాస్య – రవిల కెమిస్ట్రీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus