ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’.. ఈ సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సంగీతం తమన్ అందిస్తే.. నేపధ్య సంగీతం గోపి సుందర్ అందించినట్టు ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ద్వారా స్పష్టంచేశారు చిత్ర యూనిట్ సభ్యులు.తమన్ బిజీగా ఉండడం వలన గోపి సుందర్ కు ఆ రెస్పాన్సిబిలిటీని అప్పగించారు. ఈ ఒక్క సినిమాకే ఇలా జరిగింది అనుకుంటే పొరపాటే.. గతంలో చాలా సినిమాలకు సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు ఇచ్చారు. ఆ సినిమాలు ఏంటో? ఆ సినిమాలకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) లక్ష్మీ :

వెంకటేష్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి రమణ గోగుల సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ అందించాడు.

2)యోగి :

ప్రభాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురు కిరణ్ అందించాడు.

3)అన్నవరం :

పవన్ కళ్యాణ్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దిన అందించాడు.

4)బ్రహ్మోత్సవం :

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ అందించాడు.

5) సింహా :

బాలకృష్ణ- బోయపాటి శ్రీను డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిన్నా అందించాడు.

6)చింతకాయల రవి :

వెంకటేష్ హీరోగా యోగి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ అందించాడు.

7)టెంపర్ :

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ అందించాడు.

8)దశావతారం :

కమల్ హాసన్ హీరోగా కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి హిమేష్ రేష్మియా సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి శ్రీ ప్రసాద్ అందించాడు.

9)మజిలీ :

నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించగా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

10) సాహో :

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తనిష్క్ బాఘ్చి, గురు రాండ్వా, బాద్ షా, శంకర్ ఎసాన్ లాయ్ వంటి వాళ్ళు సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జిబ్రాన్ అందించాడు.

11)వి :

నాని, సుధీర్ బాబు లు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అందించాడు.

12) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు :

వెంకటేష్, మహేష్ బాబు లు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ అందించాడు.

13)రెబల్ :

ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి లారెన్సే సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిన్నా అందించాడు.

14)టచ్ చేసి చూడు :

రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జామ్8 ప్రీతమ్ సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ అందించాడు.

15) టక్ జగదీష్ :

ఈ మూవీకి తమన్ సంగీతం, గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus