ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ నేపథ్యం గూస్ బంప్స్ కలిగేలా..!

  • August 30, 2020 / 06:42 PM IST

దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మూవీ ప్రకటించినప్పటి నుండి మూవీ కథపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. అసలు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఏ జోనర్ లో మూవీ తెరకెక్కించనున్నారనే ఆసక్తి నెలకొని ఉంది. త్రివిక్రమ్ తన మార్కు ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తారా లేక ఎన్టీఆర్ మార్కు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తారు అనే సందిగ్ధం కొనసాగుతుంది. ఇక ఈమూవీ టైటిల్ గా అయినను పోయిరావలె హస్థినకు ప్రచారంలో ఉంది.

ఎన్టీఆర్ రెండు భిన్న గెటప్స్ లో కనిపిస్తారని అందులో ఒకటి యంగ్ బిజినెస్ మాన్ అనే ప్రచారం గట్టిగా వినిపించింది. తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ కథపై మరో ఆసక్తికర కథనం మొదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. అందులో ఒక పాత్రకు త్రివిక్రమ్ పలనాటి నేపథ్యం సెట్ చేసాడట. ఆ పాత్రలో ఎన్టీఆర్ నటన వీరత్వానికి ప్రతీకగా ఉంటుందట.

పలనాటి నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ అని సమాచారం. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తుండగా, ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం అంటున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా బాలీవుడ్ హీరోయిన్ ని ఎన్టీఆర్ కి జంటగా వెతికే పనిలో ఉన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus