Lakshmi Pranathi: వామ్మో ఎన్టీఆర్ భార్య వాడే హ్యాండ్ బ్యాగ్ ధర అన్ని లక్షలా!

  • October 27, 2022 / 11:32 AM IST

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి తెలియని వారంటూ ఉండరు.ఎన్టీఆర్ కు ఖాళీ టైం దొరికితే ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు. తన భార్య, పిల్లలతో కలిసి గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటాడు . ఆ ఫోటోలను అభిమానులు తెగ వైరల్ చేస్తుంటారు. మొన్నామధ్య లక్ష్మీ ప్రణతి ఓ పెళ్లి వేడుకకు ట్రెడిషనల్ దుస్తుల్లో.. ఒంటి నిండా నగలతో ఓ దేవత మాదిరి రెడీ అయ్యి వెళ్లిన సంగతి తెలిసిందే.

‘సాక్షాత్తు లక్ష్మి దేవి లానే ఉంది’ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరి పిల్లలకు తల్లయినప్పటికీ ఈమె 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆ వేడుకలో ఆమె ధరించిన చీర ధర రూ.3.5 లక్షల వరకు ఉంటుందట. లక్ష్మీ ప్రణతి వాడే వస్తువుల రేట్లన్నీ భారీగానే ఉంటాయట. వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇక ఈ మధ్యనే లక్ష్మీ ప్రణతి తన పిల్లలిద్దరినీ తీసుకుని తన భర్త కూడా జపాన్ వెళ్ళింది.

ఎన్టీఆర్ అక్కడ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో బిజీగా ఉంటే లక్ష్మీ మాత్రం హ్యాపీగా షాపింగ్ చేసుకుంటూ గడుపుతుంది. సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్‌గా ఉండకపోవచ్చు కానీ చాలా ఈమె అక్కడ పాపులర్.జపాన్ లో తన భర్త ఎన్టీఆర్ తో కలిసి లక్ష్మీ దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.ఇందులో లక్ష్మీ తెల్లటి కో-ఆర్డ్ సెట్‌లో మ్యాచింగ్ ట్రెంచ్ కోట్‌తో కనిపించింది.

అలాగే ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది.దీని విలువ అక్షరాలా రూ. 3,57,268 అని తెలుస్తుంది. ఇది లూయిస్ విట్టన్ బ్యాగ్‌ అట.ఎన్టీఆర్ కనుక విదేశాలకు షూటింగ్ కి వెళ్తే కచ్చితంగా లక్ష్మీ ప్రణతి మరియు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ల కోసం ఖరీదైన బహుమతులు తీసుకొస్తూ ఉంటాడట. అలాగే ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ విదేశాలకు హాలిడే వెకేషన్లకు కూడా వెళ్తుంటాడు. ప్రస్తుతం లక్ష్మీ హ్యాండ్ బాగ్ ఫోటో మాత్రం వైరల్ గా మారింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus