NTR Wife Pranathi: ఎన్టీఆర్ భార్య పేరు ట్విట్టర్ లో ట్రెండ్ కావడానికి రీజన్ ఇదే!

  • May 7, 2023 / 01:14 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి జోడీ టాలీవుడ్ బెస్ట్ జోడీలలో ఒకటి కాగా ఈ జోడీకి ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. జూనియర్ ఎన్టీఆర్ మీడియాకు దగ్గరగా ఉండటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండగా లక్ష్మీ ప్రణతి మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు లక్ష్మీ ప్రణతి న్యూస్ ఛానెళ్లకు కానీ పత్రిలకు కానీ ఇంటర్వ్యూలు సైతం ఇవ్వలేదు.
లక్ష్మీప్రణతి కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

మే నెల 5వ తేదీ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి పెళ్లి రోజు కావడంతో లక్ష్మీ ప్రణతి పేరు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచింది. లక్ష్మీ ప్రణతి పేరు ట్రెండింగ్ లోకి రావడంతో అభిమానులు సైతం సంతోషిస్తున్నారు. లక్ష్మీ ప్రణతి తారక్ జీవితంలోకి వచ్చాక తారక్ కు కెరీర్ పరంగా మరింత కలిసొచ్చిందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది నవంబర్ సమయానికి ఈ సినిమా షూట్ పూర్తి కానుందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. (NTR ) తారక్ తన ఫేవరెట్ హీరో కావడంతో తారక్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం. ఎన్టీఆర్ త్వరలో భారీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus