Kadambari Kiran: ప్రముఖ నటుడు వీరభద్రయ్యకు కాదంబరి సహాయం.. గ్రేట్ అంటూ?

  • January 13, 2024 / 12:32 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటుడు, మనం సైతం ఫౌండేషన్ నిర్వాహకులు కాదంబరి కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్న వ్యక్తుల కుటుంబాలను ఆదుకుంటూ కాదంబరి కిరణ్ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు డీ వీరభద్రయ్య ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన కాదంబరి కిరణ్ వీరభద్రయ్య కుటుంబ సభ్యులకు 25,000 రూపాయలు అందజేశారు. కాదంబరి కిరణ్ వీరభద్రయ్య కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు కుటుంబానికి తాను సపోర్ట్ గా నిలుస్తానని వెల్లడించారు.

మనం సైతం ఫౌండేషన్ సహాయంతో కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గడిచిన పది సంవత్సరాలుగా మనం సైతం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతుండటం గమనార్హం. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం మనం సైతంకు అండగా నిలుస్తున్నారు. మంచానికే పరిమితమైన పావలా శ్యామలకు కొన్నిరోజుల క్రితం కాదంబరి కిరణ్ సహాయం చేసిన సంగతి తెలిసిందే.

పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్నవాళ్లకు తనవంతు సహాయం చేస్తున్న కాదంబరి కిరణ్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కాదంబరి కిరణ్ తన సినీ కెరీర్ లో 270కు పైగా సినిమాలలో నటించి ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో విజయాలు అందుకుంటున్నారు. కామెడీ రోల్స్ లో, సహాయక పాత్రల్లో ఎక్కువగా నటించిన కాదంబరి కిరణ్ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

గతేడాది ధమ్కీ, లవ్ యూ రామ్ సినిమాలలో కాదంబరి కిరణ్ నటించారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ తన సినిమాలలో కాదంబరి కిరణ్ కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం గమనార్హం. కాదంబరి కిరణ్ మంచి మనస్సు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. (Kadambari Kiran) కాదంబరి కిరణ్ కు ఇతర భాషలలో సైతం మంచి గుర్తింపు ఉండటం గమనార్హం.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus