మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న కాజల్, గౌతమ్ కిచ్లు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్… ఎవ్వరూ ఊహించని విధంగా గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న ఈమె పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. అయితే వాటికి సంబంధించిన ఫోటోలను పెద్దగా విడుదల చెయ్యలేదు కాజల్. సెలబ్రిటీల పెళ్లి ఫోటోల హక్కులను కూడా కొన్ని సంస్థలు ఫ్యాన్సీ రేటు చెల్లించి కొనుగోలు చేసి.. వారి బ్రాండ్ తో పబ్లిసిటీ చేస్తుంటాయి. బహుశా కాజల్ పెళ్లి ఫోటోలకు మంచి రేటు ఇంకా దక్కి ఉండదు అని కొంతమంది చర్చించుకుంటున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే పెళ్లి తరువాత కాజల్ తన భర్తతో కలిసి మాల్దీవులకు హానీమూన్ నిమిత్తం వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి ఫోటోలను మాత్రం తన సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్ చేస్తూ వస్తుంది.

పనిలో పనిగా అక్కడ ప్రమోషన్లను కూడా కానిచ్చేస్తుంది కాజల్. రోజుకో కొత్త ఫోటో షూట్లో పాల్గొంటున్న కాజల్… హనీమూన్ కు వెళ్లినప్పటి నుండీ…. బీచ్ దగ్గర భర్తతో ఉన్న ఫోటోలను, అలాగే హరివిల్లులా ఒళ్లు విరిచే కొత్త కొత్త భంగిమలు చేస్తున్న ఫోటోలను అలాగే అండర్ వాటర్‌లో ఉన్న బెడ్ రూమ్ కు సంబందించిన ఫోటోలను.. షేర్ చేసింది. అవి నెట్టింట్లో తెగ హల్ చల్ చేసాయి.అయితే మాల్దీవ్స్ అనేది మోస్ట్ కాస్ట్ లీ ఏరియా అన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడికి బాగా డబ్బున్న వాళ్ళు.. సినిమా వాళ్ళు మాత్రమే వెళ్తుంటారు.ఇక కాజల్ జంట తమ హనీమూన్ అక్కడ ప్లాన్ చేసుకున్నారు అంటే భారీగా ఖర్చు అవుతుంది అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటివరకూ కాజల్ జంట రూ.40 లక్షలు ఖర్చు చేశారట. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు పెద్ద బిజినెస్మెన్ ల హనీమూన్ ట్రిప్ అంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుంది మరి.

1

2

3

4

5


6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus