టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కొత్త హీరోయిన్ల నుంచి పోటీ ఎదురవుతున్నా వరుసగా సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. 2004లో నటిగా బాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టిన కాజల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని కాజల్ అగర్వాల్ వార్తల్లో నిలిచారు. కాజల్ తాజాగా ఒక అభిమాని ఎన్ని రోజులు సినిమాలు చేస్తారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ భర్త కోరిన మరుక్షణమే సినిమాలకు గుడ్ బై చెబుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా భర్త మాటకు విలువ ఇచ్చే విధంగా నడుచుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు. కాజల్ కామెంట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాజల్ నటిగా సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించాలని ఎక్కువమంది అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగులో ఆచార్య సినిమాతో పాటు నాగ్ ప్రవీణ్ సత్తారు కాంబో మూవీలో కాజల్ నటిస్తున్నారు. తాను ఎంతకాలం సినీ రంగంలో కొనసాగుతానో చెప్పలేనని కాజల్ చేసిన కామెంట్లు కాజల్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేస్తున్నాయి.
కాజల్ ఆఫర్లు తగ్గే వరకు నటిగా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగులో సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉండటంతో కాజల్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే కాజల్ కు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!