Kajal: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గత కొన్ని సంవత్సరాల నుంచి దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా వెలిగారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. పెళ్లి అనంతరం ఈమె వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి తర్వాత కొద్ది నెలలకే కాజల్ అగర్వాల్ గర్భవతి అని తెలియడంతో ఈమె కమిట్ అయిన సినిమాల నుంచి తప్పుకొని పూర్తిగా తన మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తూ ఉన్నారు.

ఇలా తన కుమారుడు నీల్ తో కలిసి కాజల్ అగర్వాల్ ఎంతో సంతోషంగా గడుపుతున్నారని తెలుస్తుంది. ఇకపోతే కాజల్ అగర్వాల్ తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈమె భారతీయుడు 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈమె రీ ఎంట్రీ ఇచ్చే సినిమా విషయంలో కాజల్ అగర్వాల్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తాజాగా కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ అగ్ర దర్శకుడు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఆ స్టార్ డైరెక్టర్ ఈమెకు సినిమా కథ చెప్పగా వెంటనే కాజల్ అగర్వాల్ ఈ సినిమాకి సైన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో కొత్తవారు అలాగే హీరోయిన్ కూడా యంగ్ హీరోయిన్ అయితే కాజల్ అగర్వాల్ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలో కథ మొత్తం కాజల్ అగర్వాల్ పాత్ర చుట్టూ తిరగడంతో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని రీఎంట్రీ ఇవ్వడం కోసం ఇదే మంచి సినిమా అని భావించిన కాజల్ అగర్వాల్

ఒక్క క్షణం ఆలోచించకుండా ఈ సినిమాకి సైన్ చేశారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడునుంది. ఈ సినిమా ద్వారా కాజల్ అగర్వాల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus