వెండితెర చందమామగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తల్లిగా ప్రమోట్ అయ్యి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్యం తన కుమారుడికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొడుకుని చూస్తూ ఎంతో మురిసిపోతూ ఉంటారు. ఇలా తరచూ తన కొడుకు గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకొని కాజల్ తాజాగా తన కొడుకుకు సంబంధించిన క్యూట్ ఫోటోలను షేర్ చేశారు.
కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వివాహం తర్వాత కొన్ని నెలలకే ఈమె తన ప్రెగ్నెన్సీను ప్రకటించారు. ఇలా గత ఏడాది ఏప్రిల్ 19వ తేదీ పండంటి మగ బిడ్డకు కాజల్ అగర్వాల్ జన్మనిచ్చారు.ఇలా కొడుకు పుట్టిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈమె తిరిగి ప్రస్తుతం సినిమాలతో బిజీ అయ్యారు.ఇలా ఒకవైపు సినిమా షూటింగులలో పాల్గొంటూనే మరోవైపు తన కొడుకుతో విలువైన సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉన్నారు.
ఇకపోతే తాజాగా తన కుమారుడి ఫోటోలను షేర్ చేస్తూ కాజల్ అగర్వాల్ తన కొడుకు గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. ఎప్పటికీ సూర్యుడిలా వెలిగిపోతూనే ఉండే వాడు నా కొడుకు నీల్ కిచ్లు నాకు చాలా విలువైనవాడు. వాలెంటైన్‌లు ఇంకా ముగియలేదు. నీల్ కిచ్లూ నాకు ప్రేమ తాలుకా అర్ధాన్ని ప్రతిరోజూ బోధిస్తూనే ఉన్నాడు. అంటూ తల్లిప్రేమను చాటుకుంది.
ఇలా తన కుమారుడితో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఈమె తన కొడుకు పట్ల తన ప్రేమను చాటుకున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ తో కాజల్ బిజీగా ఉన్నారు.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!