సీనియర్ హీరోలకు ఆప్షన్ గా మారిన బ్యూటీ!

  • March 17, 2021 / 03:12 PM IST

ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. యంగ్ హీరోలే చాలా మంది హీరోయిన్లను రిపీట్ చేస్తున్నారు. అలాంటిది సీనియర్ హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. చాలా రోజులుగా సీనియర్ హీరోలను ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు వారికి కాజల్ రూపంలో ఓ పరిష్కారం దొరికింది. నిన్న మొన్నటివరకు యంగ్ హీరోలతో జత కట్టిన ఈ భామ ఇప్పుడు సీనియర్ హీరోలతో నటించడానికి సై అంటోంది.

చిరంజీవి, కమల్ హాసన్ లాంటి హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోన్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో సీనియర్ హీరోతో కలిసి నటించడానికి సిద్ధమవుతోంది. కాజల్ పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ.. ఎప్పుడూ కూడా నాగార్జునతో కలిసి నటించలేదు. ఎట్టకేలకు ఈ జంటని వెండితెరపై చూడబోతున్నాం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తోన్న సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా వెల్లడించింది.

ఈ నెలాఖరు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం నాగ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. గుబురు గడ్డంతో నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus