Kajal: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నిత్యం తన ప్రెగ్నెన్సీ గురించి ఏదో ఒక పోస్ట్ లు పోస్ట్ చేస్తూనే వస్తుంది. త్వరలోనే ఈమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. మాతృత్వం గురించి అందులో ఉన్న ఆనందం, ఆరాటం, భయం, గజిబిజి వంటి వాటిని వర్ణిస్తూ కాజల్ పెట్టె పోస్టులు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈమె ప్రెగ్నెంట్ లేడీస్ కు పనికొచ్చే ప్రొడక్ట్స్ గురించి అలాగే ఫ్రీ డెలివరీ కోసం ఉపయోగపడే టిప్స్ మరియు వర్కౌట్ వీడియోల్ని షేర్ చేస్తూ అలా కూడా సంపాదిస్తూ వస్తోంది.

Click Here To Watch NOW

అంతేకాదు తన బేబీ బంప్‌ ఫొటోలను కూడా షేర్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ అమ్మడు. ఇలా ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడుపుతున్న కాజల్‌.. తాజాగా తన భర్త గౌతమ్‌ కిచ్లు పై చేసిన ఎమోషనల్‌ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాజల్ తన పోస్ట్ ద్వారా స్పందిస్తూ.. “ప్రియమైన శ్రీవారు.. మీరు ఓ మంచి భర్తగా ఉండటమే కాదు ప్రతి బిడ్డ కోరుకునే గొప్ప తండ్రి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నా పట్ల నువ్వు నిస్వార్థంగా ఉన్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి రోజు రాత్రి నాతో పాటు మెలకువగా ఉండడం..

మార్నింగ్‌ సిక్‌నెస్‌లో కూడా ఎలాంటి విసుగు లేకుండా నన్ను కంఫర్ట్‌ గా ఉంచడం… అస్వస్థతగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించి వారిని రప్పించడం.. ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే నా పుట్టింటికి తీసుకెళ్ళడం. ఇలా ప్రతి విషయంలో నువ్వు చూపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు. నేను ఇబ్బంది పడకుండా నాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నావ్. త్వరలోనే మన బిడ్డ ఈ లోకంలోకి రాబోతోంది. అంతకుముందే నువ్వు ఎంత గొప్ప తండ్రివో ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను. గత 8 నెలలుగా నీలో ఓ గొప్ప తండ్రిని చూస్తున్నాను.

పుట్టబోయే బిడ్డను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, అప్పుడే ఆ బిడ్డ సంరక్షణ కోసం నువ్వు ఏం చేయాలో అది చేస్తున్నావ్. ఇలా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. వెలకట్టలేని తండ్రి ప్రేమను మన బిడ్డ పొందబోతున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన బిడ్డకు నువ్వు ఎప్పుడూ ఒక ప్రేరణ గా ఉండాలని కోరుకుంటున్నా.త్వరలోనే మన జీవితాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటిలా మన కోసం మనం టైం కేటాయించుకోలేం.

సినిమాలకు, షికార్లకు వెళ్లలేం. టీవీ చూస్తూ ఆలస్యంగా పడుకోలేం. పార్టీలకు దూరమవుతాం. అయినప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది. వీటన్నింటికి దూరమైనా బిడ్డతో విలువైన సమయాన్ని గడుపుతాం కాబట్టి. మన జీవితంలో ప్రతిక్షణం మరింత అందంగా ఆనందంగా మారబోతుంది. పరిస్థితులు మారవచ్చు కానీ, నాపై నీకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఐ లవ్యూ’ అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది కాజల్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus