Kajal: పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎదుర్కొన్నాను… కాజల్ కామెంట్స్ వైరల్!

  • July 1, 2023 / 08:50 PM IST

వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. వివాహం జరిగిన వెంటనే ఈమె ప్రెగ్నెంట్ కావడంతో కొడుకుకు జన్మనిచ్చిన అనంతరం ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు వరుస సినిమా షూటింగులలో పాల్గొంటూనే మరోవైపు తన ఫ్యామిలీ బాధ్యతలను కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

ఇకపోతే తాజాగా (Kajal) కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగే ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా నేటిజన్స్ ప్రశ్నిస్తూ మీరు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటే మీ అబ్బాయి బాగోగులు ఎవరు చూసుకుంటారని ప్రశ్నించగా తనకు తన కుటుంబ సభ్యుల సపోర్ట్ చాలా ఉందని సమాధానం చెప్పారు. నటిగా మీరు దేనికి భయపడతారనే ప్రశ్న కూడా ఈమెకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను ఎంపిక చేసుకున్న పాత్రలకు వంద శాతం న్యాయం చేయగలనా లేదా అన్న భయం తనని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందని కాజల్ అగర్వాల్ ఈ సందర్భంగా తెలియజేశారు. మరొక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ మీరు కూడా పోస్ట్ పార్టమ్ (ప్రసవానంతరం) డిప్రెషన్ ఎదుర్కొన్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాజల్ సమాధానం చెబుతూ అవును తాను కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ను ఎదుర్కొన్నానని తెలియజేశారు.

ప్రసవం తర్వాత మహిళలు ఈ విధమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్న సమయంలో తప్పకుండా తమ కుటుంబ సభ్యుల అండ వారికి ఉండాలని తెలిపారు. మహిళలు కూడా పిల్లలు పుట్టిన తర్వాత తమకంటూ కొంత సమయం కేటాయించుకోవాలని తెలియజేశారు. చిన్న చిన్న పనులు చేస్తూ ఇష్టమైన వ్యక్తులతో సమయం గడిపినప్పుడు ఆ దశ నుంచి మనం బయటపడవచ్చు అని ఈ విషయంలో తన ఫ్యామిలీ తనకు చాలా సపోర్ట్ చేసింది అంటూ ఈ సందర్భంగా కాజల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus