Kajal: ఆ ఫోటో రాజమౌళికి అంకితం చేసిన కాజల్!

  • August 12, 2022 / 10:24 AM IST

వెండితెర చందమామగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్ గత ఏడాది ప్రెగ్నెన్సీ కారణంగా కొద్దిరోజులపాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైన కాజల్ అగర్వాల్ తన మాతృత్వపు క్షణాలను అనుభవిస్తూ ఎంతో ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 19వ తేదీ కాజల్ అగర్వాల్ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

ఇకపోతే నిత్యం తన కొడుకు బాధ్యతలను చూసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. తన పెళ్లి కాకముందే కాజల్ అగర్వాల్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ కమిట్ అయ్యారు. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే వచ్చే నెలలో ఈ సినిమా తిరిగి షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది. కాజల్ అగర్వాల్ సైతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం తన కొడుకుతో కలిసి ఎన్నో ఫోటోలకు ఫోజులిస్తూ నిత్యం ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకునే కాజల్ అగర్వాల్ ఈసారి ఏకంగా బాహుబలి సినిమా సీన్ రిపీట్ చేస్తూ కట్టప్పగా మారిపోయారు. బాహుబలి సినిమాలో చిన్నప్పటి బాహుబలి జన్మించిన తర్వాత తన పాదం తీసుకొని కట్టప్ప తలపై పెట్టుకుంటారు. అదే సీన్ కాజల్ రిపీట్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ… ఈ ఫోటో నేను నీల్ కలిసి రాజమౌళి సర్ కి అంకితం చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నేటిజన్లని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలా నిత్యం ఈమె తన కొడుకుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీకి విరామం తీసుకున్న కాజల్ త్వరలోనే తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus