బాలీవుడ్‌లో హీరోయిన్ అవ్వాలంటే అర్హతలు ఏంటి? ఇదేం పిచ్చి ప్రశ్న.. అదేమైనా ఉద్యోగమా అర్హతలు ఉండటానికి, అయినా అలాంటి అర్హతలు ఏమన్నా ఉంటాయా? అని అందాం అనుకుంటున్నారా? అయితే కాసేపు ఆగండి. ఎందుకంటే ఈ అర్హతల గురించి చెప్పింది ఎవరో కాదు సీనియర్ నటి కాజోల్. హీరోయిన్‌గా ఇండస్ట్రీని కొన్నేళ్లే ఏలిన కాజోల్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ఆలరిస్తోంది. సినిమాలు, ఓటీటీల్లో అదరగొడుతోంది. ఈ క్రమంలో తన టైమ్‌లో హీరోయిన్ల ఎంపిక గురించి మాట్లాడింది. దీంతో ఆ మాటలు వైరల్‌గా మారాయి.
‘బేఖుదీ’ అనే సినిమా నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కాజోల్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంఇ స్టార్ హీరోలందరితో నటించింది. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ ఏడాదితో 30 ఏళ్లు అవుతోందంటే ఆమె సీనియారిటీని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఓటీటీల వల్ల ఎంతోమంది తారలు మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారని చెప్పింది. నటులందరికీ ఇది ఉత్తమకాలం. తమలోని టాలెంట్‌ని బయటపెట్టుకోవడానికి కొత్త అవకాశాలొచ్చాయి అని చెప్పింది.
దాంతోపాటు ఒకప్పుడు నటిగా బాలీవుడ్‌లో రాణించాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవో చెప్పింది కాజోల్. ‘‘ఒకప్పుడు నటిగా రాణించాలంటే శరీర కొలతలే ప్రామాణికంగా చెప్పుకునేవారు. ఇలాంటి బాడీ మెజర్స్ ఉంటేనే హీరోయిన్‌గా రాణిస్తారు అని చెప్పేవారు. అయితే ఇప్పుడు అలాంటి కొలతలు లేనప్పటికీ చాలామంది మంచి నటీమణులుగా ప్రేక్షకాదరణ పొందుతున్నారు. ప్రేక్షకుల మన్ననలు కూడా పొందుతున్నారు’’ అని కాజోల్ చెప్పింది.
అయితే కాజోల్ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అనిందో తెలియడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న నాయికలు చాలామంది కర్వీ బాడీతోనే వస్తున్నారు. ఒకరిద్దరు తప్ప అంతా స్లిమ్ అంట్, స్లీక్ లుక్‌లో హాట్‌నెస్ పంచుతున్నారు. మరిప్పుడు కాజోల్ వారి గురించి అనిందో, లేక క్యాజువల్‌గా చెప్పిందా? అనేది చూడాలి. కానీ ఓ స్టార్ హీరోయిన్ నోటి నుండి ఇలాంటి మాటలు రావడంతో బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!