బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అయితే కరోనా కారణంగా చాలా సింపుల్ గా బర్త్ డే పార్టీ చేసుకుంది. అయితే కాజోల్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కొందరు అభిమానులు కాజోల్ కోసం ప్రేమగా కేక్ తీసుకొచ్చారు. ఆమె కేక్ కట్ చేస్తుంటే పుట్టినరోజు పాట పాడారు.
అనంతరం ఫ్యాన్స్ కేక్ పీస్ తినండని రిక్వెస్ట్ చేస్తుంటే.. ఆమె తిరస్కరిస్తూ నో అని తలూపింది. కేక్ తినలేనని అక్కడ నుండి వెళ్లిపోయింది. ఆమెతో ఫోటోలు తీసుకుందామనుకున్న ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. మళ్లీ కాసేపటికి బయటకు వచ్చి ఒక్క ఫోటో దిగి వెంటనే వెళ్లిపోయింది. ఆమె ప్రవర్తనతో అభిమానులు కొంత హర్ట్ అయినట్లుగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది చూసిన నెటిజన్లు కాజోల్ పై మండిపడుతున్నారు. ఆమెకి ఎంత పొగరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాజోల్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించినట్లు రియల్ లైఫ్ లో ఉండదని.. బాగా యాటిట్యూడ్ చూపిస్తుంటుందని విమర్శిస్తున్నారు. ఎంత హీరోయిన్ అయితే మాత్రం మరీ ఇంత పొగరా అంటూ ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక కాజోల్ చివరిగా ‘త్రిభంగ’ అనే సినిమాలో నటించింది.
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!