కళాభవన్ మణిది సహజమైన మరణం కాదు!

మార్చి 6వ తారీఖున ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రముఖ నటుడు కళాభవన్ మణి మరణించిన విషయం తెలిసిందే. అయితే.. అప్పుడే ఆయనది సహజమైన మరణం కాదని చాలా మంది వాదించారు.
వారి వాదనలు నిజమని ఇప్పుడు తెలుస్తోంది. ఈ కేసును పరిశీలిస్తున్న పోలీసు బృందం.. “కళాభవన్ మణిపై విష ప్రయోగం జరిగింది” అని కన్ఫర్మ్ చేసింది.

దాంతో.. ఆయన కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. కళాభవన్ పై విష ప్రయోగం చేసిందెవరో వెంటనే కనుక్కోవాలంటూ పోలీసువారిని దాదాపుగా ఆదేశించినంత పనిచేసారు. మరి ఈ కేసు ఇంకెన్ని కొత్త మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus