ప్రభాస్ (Prabhas) , నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా యూఎస్ లో అడ్వాన్స్ సేల్స్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించి ఆదిపురుష్ (Adipurush) ‘సలార్’ (Salaar) అడ్వాన్స్ సేల్స్ రికార్డ్ లను బ్రేక్ చేసింది. సలార్ కూడా అడ్వాన్స్ సేల్స్ తో 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నా కల్కి వేగంగా ఆ మార్కును సొంతం చేసుకుంది.
కల్కి రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో అడ్వాన్స్ సేల్స్ కలెక్షన్లు మరింత భారీ స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓవర్సీస్ ప్రేక్షకులు కల్కి సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఇదే సాక్ష్యమని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి 35 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని భోగట్టా. 1400 షోలకు సంబంధించి ఈ అమ్మకాలు జరిగినట్టు సమాచారం అందుతోంది.
కల్కి సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా సినిమా రిలీజ్ తర్వాత ఈ విషయానికి సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుంది. ఈ సినిమాలో అమితాబ్ (Amitabh Bachchan) , ప్రభాస్ కాంబో సీన్స్ స్పెషల్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. కల్కి మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదల కానుందని త్వరలో ఇందుకు సంబంధించి స్పష్టత రానుందని భోగట్టా. కల్కి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
కల్కి మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. బుకింగ్స్ ముందుగానే మొదలుపెట్టడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. కల్కి సినిమా కచ్చితంగా హిట్ గా నిలుస్తుందని నాగ్ అశ్విన్ చెబుతున్నారు. ప్రభాస్ కల్కి రేంజ్ అంతకంతకూ పెరగాలని ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.