Chandrababu swearing: బాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి హాజరయ్యే హీరోలు వీళ్లే!

  • June 11, 2024 / 06:17 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూటమి రికార్డ్ స్థాయి స్థానాల్లో విజయం సాధించడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం వద్ద కేసరవల్లి వేదికగా బాబు ప్రమాణ స్వీకారం జరగనుండటం గమనార్హం. అయితే ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల జాబితా హాట్ టాపిక్ అవుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకకు హాజరు కానుండగా దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఈ వేడుకకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. రేపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని భోగట్టా. పవన్ డిప్యూటీ సీఎం పదవిపై ఆసక్తి చూపిన నేపథ్యంలో పవన్ మినహా మరో డిప్యూటీ సీఎం ఉండరని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే చంద్రబాబు, పవన్ లపై అభిమానంతో చరణ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారని తెలుస్తోంది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందిందని భోగట్టా. చిరంజీవి సైతం బాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. పవన్ పై ఉన్న అభిమానంతో చరణ్ (Ram Charan) ఈ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానాలు అందాయని భోగట్టా. టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఎవరెవరు హాజరవుతారో చూడాల్సి ఉంది.

ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో చంద్రబాబు, పవన్ అభిమానులు హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమం ఊహించని స్థాయిలో సక్సెస్ కావాలని కూటమి అభిమానులు కోరుకుంటున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో టాలీవుడ్ కు బెనిఫిట్ కలిగేలా కీలక నిర్ణయాలు అమలులోకి రానున్నాయని తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్ల విషయంలో బెనిఫిట్ కలిగేలా నిబంధనలు అమలు కానున్నాయని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus