టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోయిన్లలో ఆదాశర్మ (Adah Sharma) ఒకరు కాగా ఆదాశర్మ తాజాగా ఒక సందర్భంలో తన ఆరోగ్య సమస్యల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఆదాశర్మ కేరళ స్టోరీ (The Kerala Story) సినిమాలో నటించే సమయంలో కాలేజ్ అమ్మాయిలా కనిపించడం కోసం బరువు తగ్గాల్సి వచ్చిందని ఆమె అన్నారు. ఆ సినిమా తర్వాత బస్తర్ సినిమాలో నటించడం కొరకు బరువు పెరిగానని ఆమె పేర్కొన్నారు.
బస్తర్ మూవీ బరువైన గన్స్ మోయాలి కాబట్టి రోజుకు 10 నుంచి 12 అరటి పళ్లు తినడం ద్వారా బలంగా కనిపించడానికి ప్రయత్నించానని ఆదాశర్మ వెల్లడించారు. గింజలు, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలను సైతం షూటింగ్ కు తీసుకెళ్లేదానినని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చిందని ఆదాశర్మ పేర్కొన్నారు. నెలల వ్యవధిలో బరువు పెరగడం తగ్గడం శరీరంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె తెలిపారు.
అదే సమయంలో ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటంతో పీరియడ్స్ ఆగకుండా వచ్చాయని 48 రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆదాశర్మ వెల్లడించారు. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదాశర్మ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో బాలీవుడ్ పై ఈ బ్యూటీ ఫోకస్ పెట్టారు.
చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకోవడం ఆదాశర్మకు ప్లస్ అవుతోంది. సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో ఆదాశర్మ ఒకరు కావడం గమనార్హం. ఆదాశర్మ సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదాశర్మకు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది.