చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తల్లి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

Advertisement

కళ్యాణ్ దేవ్ అందరికీ సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.’విజేత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతను తర్వాత ‘సూపర్ మచ్చి’ ‘కిన్నెరసాని’ వంటి సినిమాల్లో నటించాడు. ఇందులో కిన్నెరసాని సినిమా కొంత పర్వాలేదు అనిపించినా మిగిలిన రెండు సినిమాలు ఆడలేదు. ఇదిలా ఉండగా.. కళ్యాణ్ దేవ్ పర్సనల్ లైఫ్ పరంగా స్ట్రగుల్ అవుతున్నట్టు ఏడాది నుండి ప్రచారం జరుగుతూనే ఉంది. తన భార్య శ్రీజతో ఇతను విడాకులు తీసుకోబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వాటి పై వీళ్ళు నేరుగా స్పందించింది లేదు.

పరోక్షంగా ఒకరిపై మరొకరు ట్వీట్లు వేసుకుంటూ ఆ ప్రచారం నిజమే అన్నట్టు హింట్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు కళ్యాణ్ దేవ్ తన తల్లి గురించి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.ఈరోజు తన తల్లి జ్యోతి పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్ దేవ్ ఈ పోస్ట్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ” హ్యాపీ బర్త్ డే అమ్మ.. నేను ఎప్పటికీ నీతో ఉండాలనుకుంటున్నాను. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.నాకు తెలిసి రియల్ సెలబ్రేషన్ అనేది మనమంతా కలిసున్నప్పుడే.

ఈ టైంలో నిన్ను కూడా బాగా మిస్ అవుతున్నాను నివిష్క(కళ్యాణ్ దేవ్ కూతురు)” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. కళ్యాణ్ దేవ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అతని ఫాలోవర్స్ అంతా కళ్యాణ్ దేవి తల్లి జ్యోతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే ఇంకొందరు మానసికంగా ధైర్యంగా ఉండు బ్రో అన్నీ అవే సెట్ అవుతాయి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news