OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓం'(OM). శ్రీలీల ఈ చిత్రంలో ధనుష్ కి జోడీగా నటించింది. ‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకుడు. సాయి అభ్యంకార్ సంగీతంలో రూపొందిన ‘వీర వీర’ అనే పాట కొన్ని నెలల నుండీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

OM

దీంతో సినిమాకి మంచి పబ్లిసిటీ జరిగినట్టు అయ్యింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రెయిలర్ వంటివి కూడా ఆడియన్స్ ను మెప్పించాయి. అందువల్ల సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా బజ్ క్రియేట్ అయ్యింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఒకసారి ఈ ‘ఓం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  1.01 cr
సీడెడ్  0.20 cr
ఆంధ్ర(టోటల్)  0.89 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)  2.1 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్)  0.08 cr
ఓవర్సీస్ (తెలుగు వెర్షన్)  0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్  2.28 cr (షేర్)

‘ఓం’ చిత్రం తెలుగు వెర్షన్ కి వరల్డ్ వైడ్ గా రూ.7.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.2.28 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.25 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.22 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus