టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా!

  • May 31, 2018 / 01:17 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి విజేతఅనే టైటిల్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై లో విడుదల చెయ్యడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అభిమానుల అంచనాలకు తగట్లు ఈ సినిమా ఉండబోతోంది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘బాహుబలి’ కెమెరామెన్ కె.కె.సెంధిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు మురళి శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus