ఇలా ఐతే నందమూరి హీరోకు కష్టమే..!

  • January 3, 2020 / 05:57 PM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా అంటూ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఆయన ముగ్గురు బడా హీరోల చిత్రాలతో పోటీ పడాల్సివుంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలతో పాటు సౌత్ ఇండియా సూపర్ స్టార్ట్ రజిని నటించిన దర్బార్ చిత్రాలు సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తీవ్ర పోటీ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో ఒకరికి మించి ఒకరు కొత్త కొత్త టెక్నిక్స్ తో దూసుకెళుతున్నారు. నవంబర్ నెలలో మహేష్ సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల చేయడంతో పాటు, గత నెల ప్రతి సోమవారం ఒక సాంగ్ విడుదల చేశారు. దేవిశ్రీ అందించిన సాంగ్స్ మిశ్రమ స్పందన అందుకోగా, టీజర్ కి విశేష ఆదరణ దక్కింది.

ఇక బన్నీ… త్రివిక్రమ్ తో చేస్తున్న అల అవైకుంఠపురంలో హ్యాట్రిక్ మూవీ కావడం మరియు గతంలో వీరిద్దరి నుండి వచ్చిన రెండు చిత్రాలు విజయం సాధించడంతో అల వైకుంఠపురంలో చిత్రం పై అంచనాలు బాగున్నాయి. థమన్ సాంగ్స్ సూపర్ హిట్ కావడం మరో అడ్వాంటేజ్. కాగా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రమోషన్స్ విషయంలో వెనుకబడ్డాడు అనిపిస్తుంది. బన్నీ, మహేష్ లు ప్రమోషన్స్ పోటీ పడి చేస్తుంటే కళ్యాణ్ రామ్ టీమ్ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు అనిపించడం లేదు. ఎప్పుడో దసరా టైమ్ లో ఒక టీజర్ విడుదల చేయగా.. ఈ మధ్య రెండు మూడు లిరికల్ సాంగ్స్ విడుదల చేశారు. అవి కూడా జనాల్లోకి పూర్తిగా వెళ్ళలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలకు సంక్రాంతికి మంచి డిమాండ్ ఉంటుంది. కళ్యాణ్ కొంచెం ప్రొమోషన్స్ పై ద్రుష్టి పెడితే విజయం ఏమంత అసాధ్యం కాదు. మరి ఇకనైనా ప్రమోషన్స్ జోరు పెంచకపోతే సంక్రాంతి పోరును ఎదుర్కోవడం కష్టం అవుతుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus