కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life) అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిన్న వైజాగ్ వచ్చింది సినిమా యూనిట్. ఇందులో భాగంగా కమల్ హాసన్ మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘మరో చరిత్ర’ రోజులను గుర్తు చేసుకుని ఆయన నోస్టాల్జిక్ గా ఫీల్ అయ్యారు. అలాగే ఇంకా చాలా సినిమాల షూటింగ్లు వైజాగ్లో చేసినట్టు కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
వైజాగ్ జనాలు కమల్ ను ఓన్ చేసుకున్న విధానానికి ఆయన మురిసిపోయారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. “మీకు మంచి సినిమాలు ఇవ్వడం అనేది నా బాధ్యత. నేను తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేశాను. వాటి ట్రాక్ రికార్డు బాగుంది. నేను 15,16 స్ట్రైట్ తెలుగు సినిమాలు చేశాను. అందులో 13 హిట్ సినిమాలు ఉన్నాయి. ఇందులో హిట్ సినిమాలు మీరు ఇచ్చినవి. ప్లాప్ సినిమాలు ఏమైనా ఉంటే అవి నేను ఇచ్చినవి. ఇది సవినయంతో చెప్పడం కాదు.
ఇదే నిజం. నేను చేసిన బ్యాడ్ మూవీస్ ని దృష్టిలో పెట్టుకుని ఎంతో శ్రద్ధతో ఈ ‘థగ్ లైఫ్’ చేశాను. ఈ సినిమాతో నేను మీ రుణం తీర్చుకుంటాను” అంటూ చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ మాటలు చాలా మంది హీరోలకి ఓ పాఠం కావాలి. ఎందుకంటే ప్లాప్ సినిమాలకి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వేరే వాళ్ళ మీద ముఖ్యంగా దర్శకుల మీద తోసేయలేదు.
తెలుగులో నేను 16 స్ట్రైట్ సినిమాలు చేశాను.. అందులో 13 సినిమాల వరకు హిట్ అయ్యాయి
హిట్లు మీరిచ్చారు.. ప్లాప్ సినిమాలు ఉంటే అవి నేను ఇచ్చినవే #Thuglife #KamalHaasan #ManiRatnam #ArRahman #Trisha #Simbu pic.twitter.com/5yLpF0VFlf
— Filmy Focus (@FilmyFocus) May 29, 2025