Khaleja: ‘ఖలేజా’ థియేటర్లలో అర్ధరాత్రి హడావుడి.. అలా ఎలా లేపేస్తారంటూ..!

సినిమా రిలీజ్‌ను కంటే.. రీరిలీజ్‌నే ఇప్పుడు అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రోజులవి. తమ హీరో పాత సినిమా (అది హిట్‌ కాకపోయినా) ఇప్పుడు వస్తోంది అంటే తెగ ఆనందించేస్తూ చూసేస్తున్నారు. దాని గురించి ట్రెండింగ్‌లు, వైరల్‌లు చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న సినిమాలు ఆ స్థాయిలో లేకపోవడమో, లేక సినిమాలే రాకపోవడమో కారణం అనుకోండి. ఆ విషయం వదిలేస్తే ఫ్యాన్స్‌ అంత ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్న రీరిలీజ్‌ల విషయంలో ఆ సినిమాను ఇప్పుడు రిలీజ్‌ చేస్తున్న ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి.

Khaleja

‘ఖలేజా’ (Khaleja) సినిమా విషయంలో ఇది మిస్‌ అయ్యింది. తొలిసారి విడుదల సమయంలో డిజాస్టర్‌గా నిలిచిన ‘ఖలేజా’ సినిమాను ఇప్పుడు హైప్‌ తీసుకొచ్చి మరీ రీరిలీజ్‌ చేస్తున్నారు. దీని కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గురువారం సాయంత్రం నుండే షోస్‌ పడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మునపటి సందడి కనిపించింది. హంగామాతో థియేటర్లలో అడుగుపెట్టిన ఫ్యాన్స్‌కి పెద్ద షాకే తగిలింది.

సినిమా సెకండాఫ్‌లో హై వచ్చే సండే మండే పాట, మహేష్ బాబు (Mahesh Babu) – ఇతర నటుల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాలో కనిపించలేదు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యనా లేక ఎడిటింగ్‌లో తీసేశారో తెలియదు కానీ.. సోషల్‌ మీడియాలో అయితే ఈ విషయంలో పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఫ్యాన్స్‌ ఆగ్రహం సినిమా బాగోలేకపోవడం వల్ల అంటూ కామెంట్లు కనిపించాయి.

అయితే ఈ నిరసనతో ‘ఖలేజా’ సినిమా టీమ్ రాత్రికి రాత్రి రిపేర్లు చేసి తొలగించిన కంటెంట్‌ను సినిమాలో తిరిగి పెట్టే ఏర్పాటు చేస్తోందని సమాచారం. మరి ఈ రోజు షోలు మొదలైతే కానీ అసలు విషయం తెలియదు. ఒకవేళ ఈ రోజు కూడా లేకపోతే నిరసనలు ఇంకా పెద్ద ఎత్తున ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఆ సన్నివేశాల తొలగింపు నిర్ణయం ఎవరిదో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus