Kangana Ranaut: థియేటర్ల కోసం రిక్వెస్ట్ చేస్తోన్న కంగనా!

మహారాష్ట్ర గవర్నమెంట్ పై గతంలో విమర్శలు చేసి, శివసేనపై దూకుడుగా వయవహరించిన నటి కంగనా రనౌత్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేసింది ఇప్పుడు. సోషల్ మీడియాలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. దాని సారాంశం ఏంటంటే.. మహారాష్ట్రలో థియేటర్లు తెరవాలనేది కంగనా పాయింట్. మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. కాబట్టి థియేటర్లను తెరవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కంగనా తన పోస్ట్ లో కోరింది.

ఈ వారంలోనే కంగనా నటించిన ‘తలైవి’ సినిమా విడుదల కానుంది. అందుకే ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ థియేటర్లను తెరవాలని కంగనా కోరుతోంది. థియేటర్లను తెరిస్తే ప్రేక్షకులను రప్పించే సత్తా తన సినిమాలో ఉందని కంగనా చాలా నమ్మకంగా చెబుతోంది. తన సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండే సరికి కంగనా ఇలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అర్థిస్తోంది. గతంలో ఠాక్రే ప్రభుత్వంతో కంగనాకు చిన్న సైజ్ వార్ జరిగింది. ఒకానొక దశలో కంగనా ముంబైలో అడుగుపెట్టడానికి కూడా భయపడింది.

చివరికి భారీ భద్రతా ఏర్పాట్ల మధ్యన కోర్టు నుండి ముందస్తు బెయిల్ తీసుకొని ముంబైకి వెళ్లింది. అలాంటిది ఇప్పుడు ఆమె రిక్వెస్ట్ ను ఠాక్రే ప్రభుత్వం అసలు లెక్కలోకి తీసుకుంటుందా..? ఈ విషయంలో కంగనాను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus