Karate Kalyani: ఎవరు విగ్రహం పెట్టినా ఊరుకునేది లేదు.. కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్!

  • May 30, 2023 / 03:09 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటి కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేయడం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వివాదం విషయంలో కొంతమంది కరాటే కళ్యాణిని సపోర్ట్ చేయగా మరి కొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం ఈ వివాదం గురించి రియాక్ట్ కావడానికి ఇష్టపడటం లేదు. ఈ వివాదం గురించి స్పందిస్తే వివాదం మరింత పెద్దది అయ్యే అవకాశం అయితే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమయంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు, సభ్యులు మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కరాటే కళ్యాణిని సస్పెండ్ చేయడం దారుణం అని అన్నారు. భగవంతునికి మానవ రూపం ఇవ్వరాదని ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తే సస్పెండ్ చేయడం సరికాదని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

కరాటే కళ్యాణిని (Karate Kalyani) సస్పెండ్ చేయడం ద్వారా సినిమా పరిశ్రమ ఒక వర్గానికి చెందిందని అర్థం అవుతోందని వాళ్లు తెలిపారు. సస్పెన్షన్ ను వెనక్కు తీసుకోకపోతే హైదరాబాద్ లో ఉన్న 20 లక్షల మంది యాదవులు ఒక్కటై పోరాటం చేస్తామని వాళ్లు వెల్లడించడం గమనార్హం. ఆ తర్వాత కరాటే కళ్యాణి మాట్లాడుతూ తాను సీనియర్ ఎన్టీఆర్ ను ఎప్పుడూ కించపరచలేదని వెల్లడించారు.

తాను కూడా సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని ఆమె చెప్పుకొచ్చారు. కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ అనే కాకుండా ఎవరు పెట్టినా ఊరుకునేది లేదని ఆమె తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షోకాజ్ నోటీసులు ఇవ్వడమే వ్యాలిడిటీ కాదని సస్పెన్షన్ ఎలా చేస్తారని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. త్వరలోనే తనపై సస్పెషన్ ఎత్తివేస్తారనే ఆశ ఉందని ఆమె పేర్కొన్నారు. అలా చేయని పక్షంలో తాను పోరాటం చేస్తానని కరాటే కళ్యాణి వెల్లడించారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus