Karate Kalyani: నాకు సరైన బహుమతి దక్కింది.. కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్!

  • May 27, 2023 / 08:52 PM IST

ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఈ మధ్య కాలంలో ఏ విషయం గురించి మాట్లాడినా వివాదం అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో కరాటే కళ్యాణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసి అందరికీ భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరాటే కళ్యాణి ఈ ఘటన గురించి మరోమారు స్పందించి వివరణ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ అంటే నాకు గౌరవమని నేను ఆయన ఫ్యాన్ అని ఆమె తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ గురించి నేను తక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని (Karate Kalyani) కరాటే కళ్యాణి వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కృష్ణుని రూపంలో విగ్రహం ఏర్పాటు చేయొద్దని మాత్రమే నేను కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ రాముడి పాత్రలో, చిరంజీవి శివుడి పాత్రలో, నాగార్జున అన్నమయ్య రామదాసు పాత్రల్లో, సుమన్ వెంకటేశ్వర స్వామి పాత్రల్లో నటించారని కరాటే కళ్యాణి అన్నారు.

రాబోయే రోజుల్లో ఆయా హీరోల అభిమానులు సైతం అదే అవతారాలలో విగ్రహాలు పెడతామంటే ఏం చెబుతారని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేయడం బాధగా ఉందని ఆమె కామెంట్లు చేశారు. నేను సినిమా ఇండస్ట్రీ తరపున చాలాసార్లు మాట్లాడానని ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. నాకు సరైన బహుమతి ఇచ్చారని ఆమె కామెంట్లు చేశారు.

వివరణ ఇవ్వడానికి కూడా నాకు సరైన సమయం ఇవ్వలేదని (Karate Kalyani) కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. ఎవరి ఒత్తిడి వల్ల అయినా సస్పెండ్ చేశారేమో తెలియదని ఆమె పేర్కొన్నారు. కరాటే కళ్యాణి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె కామెంట్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus