Karthikeya 2: 48 గంటల్లో భారీ స్టీరింగ్ మినిట్స్ సొంతం చేసుకున్న కార్తికేయ 2!

  • October 8, 2022 / 05:37 PM IST

డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2.ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగులో ఎంతో అద్భుతమైన విషయాన్ని సొంతం చేస్తుంది. ఈ విధంగా తెలుగులో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని హిందీ తమిళ మలయాళ భాషలలో కూడా విడుదల చేశారు. ఈ సినిమా ఊహించని విధంగా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇలా థియేటర్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విజయదశమి సందర్భంగా ఓటీటీలో కూడా ప్రసారమైనటువంటి ఈ కార్యక్రమం ఇక్కడ కూడా అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది. థియేటర్లో ఏలాంటి రికార్డులను సృష్టించిందో ఓటీటీలో కూడా అలాంటి రికార్డులను సృష్టిస్తోంది.

ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ డిజిటల్ మీడియాలో ప్రసారం కాగా ఈ సినిమా ప్రసారమైన నల 8 గంటల్లోనే ఏకంగా 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకుంది. ఇలా తక్కువ సమయంలోనే భారీ స్ట్రీమింగ్ మినిట్స్ గా సొంతం చేసుకోవడంతో మేకర్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.శ్రీకృష్ణుని గొప్పతనం గురించి తెలియజేసే ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని థియేటర్లో ఈ సినిమాని చూడటం మిస్ అయిన నెటిజన్ లు ఓటీటీలో ఈ సినిమాని చూస్తూ సినిమాని ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus