సినిమా, టీవీ రంగాల్లో ఉండే తారల జీవితాలు ఎంతో కలర్‌ఫుల్ గా ఉంటాయని అనుకుంటూ ఉంటాం. కానీ.. వారి జీవితాల్లో కూడా కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొన్న తరువాతే ఒక స్థాయికి చేరుతారనే సంగతి చాలామందికి తెలియదు. తెరవెనుక ఎన్ని కష్టాలున్నా.. వాటిని కప్పిపుచ్చి తెర ముందుకొచ్చి ఆడియన్స్ ను అలరిస్తుంటారు. బుల్లితెరపై వినోదాన్ని పంచుతున్న తేజస్విని (C/O అనసూయలో శివాణి), కస్తూరి సీరియల్ నటి ఐశ్వర్యల జీవితాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇద్దరూ చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. ఒకరు తల్లి కడుపులో ఉండగానే తండ్రికి దూరమైతే.. మరొకరు యుక్త వయస్సులో తండ్రిని శాస్వతంగా కోల్పోయారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరారు. ‘స్టార్ మా పరివార్ లీగ్ 3’లో పాల్గొన్న తేజస్విని, ఐశ్వర్యలు తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగానని.. ఆఖరికి తన తండ్రి చివరి చూపుకి కూడా నోచుకోలేదని తేజస్విని ఏడ్చేసింది.
ఇంటర్ లో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారని.. రాత్రంతా జర్నీ చేసి ఉదయాన్నే ఇంటికి వెళ్లేలోపు అన్ని కార్యక్రమాలు చేసేశారని.. ఆయన చనిపోయేవరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయానని కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే సమయంలో ‘కస్తూరి’ సీరియల్ ఫేమ్ ఐశ్వర్య కూడా ఎమోషనల్ అయింది. స్టేజ్ పై ఉన్న తన తల్లిని చూస్తూ.. తన తండ్రి చేసిన మోసాన్ని తలచుకొని ఏడ్చేసింది. తను కడుపులో ఉన్నప్పుడే నాన్న.. అమ్మని వదిలేసి వెళ్లిపోయాడని..
అప్పటినుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడి ఇక్కడవరకు తీసుకొచ్చిందని చెప్పింది. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకొని ఒక ఆడదాని జీవితంతో ఎందుకు ఆడుకోవాలని..? ప్రశ్నించింది. దయచేసి ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోవాలని.. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడుచేయొద్దంటూ తన తల్లిని పట్టుకొని ఏడ్చేసింది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?