నేను చిన్నప్పుడు చిన్నసైజు రౌడీనే అని అంటుంటారు కొంతమంది రౌడీలు. ఆ రోజుల్లోనే ఎవరైనా ఏమైనా అంటే ఒక్కొక్కరికి చుక్కలు చూపించేదాన్ని చెబుతుంటారు. మీరు కూడా ఇలాంటి మాటలు వినే ఉంటారు. అయితే ఇదే మాట ఓ హీరోయిన్ చెబితే ఆసక్తికరంగా ఉంటుంది కదూ. ఇప్పుడు అదే మాట అంటోంది యువ కథానాయిక కయారు లోహర్. తన చిన్నతనంలో జరిగిన ఓ విషయాన్ని ఆమె ఇటీవల చెప్పుకొచ్చింది. అందులో ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
స్కూల్‌కి వెళ్లే రోజుల్లో ఓసారి తనపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని రాయితో కొట్టిందట కయాదు. అయితే ఇప్పుడు ఆ సంఘటనని గుర్తు చేసుకుంటే చాలా వైలంట్‌గా చేసిన పనిలా అనిపిస్తోంది అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పింది అనేగా మీ డౌట్. ఎదుటి వాళ్లు తప్పు చేసినప్పుడు మౌనంగా అంగీకరించకూడదు అని చెబుతూ ఆ విషయం గురించి చెప్పిందన్నమాట. ఇంతకీ రోజు ఏమైందంటే.. కయాదు పదో తరగతి చదువుతున్నప్పుడు వాళ్ల ఇంటి దగ్గరలో ఉండే ట్యూషన్‌కు వెళ్లేదట.
ఆ ట్యూషన్‌కి వెళ్లే దారిలో కొంతమంది అబ్బాయిలు వేధించేవారు. ఓ రెండు రోజులు చూసి, వదిలేసినా మూడో రోజు భరించలేకపోయిందట. కోపంతో ఆవేశంగా ఒక రాయి తీసుకుని వాళ్లల్లో ఒకరిపై విసిరిందట. అది తగిలిన వ్యక్తి తల నుండి రక్తం కారిందట. దీంతో అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయిందట. అయితే ఆ తర్వాత ఆలోచిస్తే కోపంలో అయినా సరే అవతలి వారిని గాయపరచడం సరికాదని తెలుసుకున్నా అని చెప్పింది.
రీసెంట్‌గా ‘ఫంకీ’ అనే సినిమాతో వచ్చి ఇబ్బందికర ఫలితం అందుకున్న కయాదు.. తన గ్లామర్, నటనకు మంచి మార్కులే వేసుకుంది. ఇక నెక్స్ట్సినిమాలు చూస్తే.. ‘ఇమ్మోర్టల్’, ‘ఐయామ్ గేమ్’, నాని ‘ప్యారడైజ్’, ‘థారామ్’, ‘మంజనాత్తి’ సినిమాలతో తోపాటు సూర్య 48వ సినిమాలోనూ నటిస్తోంది.