Keeravaani Remuneration: కీరవాణి రెమ్యునరేషన్.. ఆ మాత్రం ఇవ్వాల్సిందే!

  • August 2, 2021 / 06:44 PM IST

సంగీత దర్శకుడు ఎమ్ఎమ్.కీరవాణి అనగానే ఎన్నో మెలోడీ సాంగ్స్ తో పాటు మాస్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ గుర్తొస్తాయి. భక్తిరస పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు అన్ని రకాల జానర్స్ ను టచ్ చేసిన మరకతమని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను ఎక్కువగా చేస్తున్నాడు. ఇక RRR సినిమా కోసం ఆయన ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి ప్రతి సినిమాకు కూడా కీరవాణి మ్యూజిక్ అందిస్తాడాని స్పెషల్ గా చెప్పనివసరం లేదు.

ఆయన సినిమాలతోనే ఎక్కువగా హిట్స్ అందుకున్నాడు. ఒకవిధంగా టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎమ్ఎమ్.కీరవాణి ఒకరు. కీరవాణితో వచ్చిన బడా మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా వరకు స్లో అయ్యారు. ఇక ఆయన తరువాత వచ్చిన వారు కూడా ఫెడవుడ్ అయ్యారు. కానీ కీరవాణి మాత్రం అన్ని భాషలను కదిలించేలా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయనకు RRR సినిమాకు ప్రత్యేకంగా 18కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా కీరవాణి సరికొత్త రికార్డును అందుకున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమళ్లు సినిమాకు కూడా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus