Keerthi Bhat: నేను బాగాలేనని నన్ను బయటకు గెంటేశారు: కీర్తి భట్

  • December 15, 2022 / 05:16 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న నటి కీర్తి భట్ గురించి అందరికీ సుపరిచితమే. ఇక బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఆమె నిజజీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు తెలిసి ఎంతోమంది ఈమెకు అభిమానులుగా మారిపోయారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో 14 వారాల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసిన కీర్తి జర్నీ చూపిస్తూ బిగ్ బాస్ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు.

కీర్తి గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ… కీర్తి కల్పితం కన్నా నిజ జీవితం ఎంతో నాటకీయమైనది. ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని కలిచి వేస్తున్నప్పటికీ జీవితంపై దండయాత్ర చేశారు. మీరు చూపించిన ఈ గుండె నిబ్బరం ఎంతో మందికి ఆదర్శం. అడవిలో మహావృక్షం ఒక్కటేనని బాధపడుతూ తలవంచితే తన ఎదుగుదలను చూడలేదు. మీకుగా మీరు సంపాదించుకున్న ప్రేమను ఎన్నో రేట్లు పొందడానికి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

హౌస్ లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి ఎంతో ధైర్యంగా పోరాడుతూ ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు సింపతీ కోసమే మీ ప్రయత్నం అని మిగతావారు నిందించినప్పుడు మీ మనసు గాయమైంది. ఇలా అన్నింటిని అధిగమించి 14 వారాల ఈ జర్నీ తర్వాత గ్రాండ్‌ ఫినాలేకు చేరాలనే కోరిక సాధ్యమవడానికి కారణం మీ ఒక్కరు మాత్రమే కాదు, మీ కుటుంబం కూడా. ఇప్పుడు మీ కుటుంబం సంఖ్య ఒకటి కాదు కొన్ని లక్షల అని చెప్పి ముగించాడు అనంతరం కీర్తి తన జర్నీ చూసి మురిసిపోయి..

ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ ఎమోషనల్ అయ్యారు. నేను ఇప్పుడు చెప్తున్నా ఎవరైతే నన్ను చీదరించుకొని దూరం పెట్టారో, నేను అనారోగ్యంగా ఉన్నానని బాగాలేనని ఇంటి నుంచి బయటకు పంపించారో వారికి చెబుతున్నా… ఇది కీర్తి ఈరోజే నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి దొరుకుతుందని భావిస్తున్నాను. ఇన్నాళ్లకు నేను మనస్పూర్తిగా నవ్వుతున్నాను.నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి రుణపడి ఉంటా అంటూ ఈ సందర్భంగా కీర్తి భట్ ఎమోషనల్ అయ్యారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus