Keerthy Suresh Father: ఆ అబ్బాయి నాకు తెలుసు.. కీర్తి సురేష్ డేటింగ్ రూమర్లపై క్లారిటీ!

నటి కీర్తి సురేష్ గురించి ఈ మధ్య కాలంలో పెళ్లి ప్రేమ అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా తరచూ పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈమె త్వరలోనే బిజినెస్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే తన పెళ్లి గురించి వార్తలు వస్తున్న ప్రతిసారి కీర్తి సురేష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు. అయితే తాజాగా కీర్తి సురేష్ స్వయంగా ఒక అబ్బాయి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలో ఒక అబ్బాయితో కలిసి కీర్తి సురేష్ ఓకే కలర్ అవుట్ ఫిట్ ధరించి కనిపించారు. ఇలా వీరిద్దరూ కనిపించడంతో చాలామంది కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తనే అంటూ పెద్ద ఎత్తున వార్తలను స్ప్రెడ్ చేశారు. అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందిస్తూ ఆ అబ్బాయి తన ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చారు. అలాగే తన లైఫ్ లోకి రాబోయే మిస్టరీ మాన్ ఎవరు అనే విషయాన్ని కూడా తాను త్వరలోనే చెబుతానని తెలిపారు.

ఇలా కీర్తి సురేష్ (Keerthy Suresh) క్లారిటీ ఇచ్చినప్పటికీ తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు ఏమాత్రం ఆగడం లేదు. సురేష్ తండ్రి స్పందించి తన కూతురి గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టారు.నా కూతురు ప్రేమలో ఉందని అతనితో త్వరలో పెళ్లి అంటూ కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో నిజం లేదని కీర్తి సురేష్ తండ్రి సురేష్ వెల్లడించారు.

కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలోని అబ్బాయి తనకు బాగా తెలుసు అని తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మా కుటుంబంతో ఎంతో మంచి పరిచయం ఉందని ఈయన తెలియజేశారు. తన కుమార్తెకు పెళ్లి ఫిక్స్ అయితే తప్పకుండా ఈ విషయాన్ని అందరితోనూ పంచుకుంటామని అంతవరకు ఇలాంటి వార్తలను రాయడం మానేయాలని కోరారు. ఇలా తన కుమార్తె పెళ్లి డేటింగ్ వార్తల గురించి ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుందని కీర్తి సురేష్ తండ్రి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus