2016 లో ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్… మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక తరువాత చేసిన ‘నేను లోకల్’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో హీరోయిన్ గా చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ ఈమె పెద్ద దర్శక నిర్మాతల దృష్టిలో పడింది.
ఇక ఈ క్రమంలో వచ్చిన ‘మహానటి’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం… ముఖ్యంగా ఈమె నటనకు మంచి గుర్తింపు దక్కడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా అయిపోయింది. నేషనల్ అవార్డు కూడా కొట్టేసింది. ఇదిలా ఉండగా… ఈమె త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో ఈమె వివాహం ఉండబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
అది కూడా ఈ సంవత్సరం పూర్తయ్యేలోపే వివాహం చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల పై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. ‘నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. 2021 పూర్తయ్యే వరకూ నేను కాల్ షీట్స్ ఇచ్చేసాను. ఇలాంటి పరిస్ధితుల్లో పెళ్ళి ఎలా చేసుకుంటాను. దయచేసి ఆ వార్తలను నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చింది కీర్తి.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్