ఆదిపురుష్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకున్నారట..?

  • August 20, 2020 / 12:59 PM IST

సినిమా పరిశ్రమలో రాణించాలంటే ఎంత టాలెంట్ ఉన్నా లక్ అనేది కూడా చాల ముఖ్యం. దర్శక నిర్మాతలు మరియు హీరోలు తమ సినిమాలలో అవకాశం ఇవ్వాలి అంటే సదరు హీరోయిన్ హిట్ ట్రాక్ పరిగణలోకి తీసుకుంటారు. అందం, అభినయం కొంచెం అటూ ఇటూ అయినా లక్కీ లేడీ అనే ట్యాగ్ వుంటే అవకాశాలు వద్దన్నా వచ్చి పడుతుంటాయి. మరి అందం, అభినయం మరియు అదృష్టం అనే అరుదైన కాంబినేషన్స్ కలిగిన కీర్తి సురేష్ లాంటి అమ్మాయికి తిరుగేముంటుంది చెప్పండి.

టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోతున్న తరుణంలో మహానటి సినిమాలో అవకాశం దక్కించుకొని తన కెరీర్ ని మలుపు తిప్పుకుంది. ఆ మూవీతో వచ్చిన ఇమేజ్ తో ఓ ప్రక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మరో ప్రక్క స్టార్ హీరోల పక్కన కమర్షియల్ సినిమాలు చేస్తుంది. గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా అనే రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్న కీర్తి మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవడం విశేషం.

నితిన్ సరసన రంగ్ దే మూవీలో కూడా ఆమె నటిస్తుంది. వీటన్నింటికీ మించి ప్రభాస్ భారీ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ మూవీలో సీతగా కీర్తికి అవకాశం దక్కింది అంటున్నారు. మరి ఒక వేళ ఇదే కనుక నిజమైతే కీర్తి నక్క తోక తొక్కినట్లే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మూవీలో అరుదైన సీత పాత్ర చేసే అవకాశం రావడం అంటే వంద కోట్ల లాటరీ దక్కినట్లే. ఐతే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏమీ చెప్పలేం.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus