‘జబర్దస్త్’ కమెడియన్ కెవ్వు కార్తీక్ జూన్ 9న పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన అతను అటు తర్వాత కమెడియన్ గా జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. ఓ వైపు జబర్దస్త్ … మరోవైపు వెండితెరపై అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్న ఇతను బెల్లంకొండ గణేష్ నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ తో సినిమాల్లోకి అడుగుపెట్టాడు.
ఇక కార్తీక్ (Kevvu Karthik) పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గెటప్ శ్రీను వంటి టాప్ కమెడియన్స్ అతని పెళ్ళికి వెళ్లి సందడి చేశారు. ఇక కార్తీక్ భార్య పేరు శ్రీలేఖ.కార్తీక్ ఆమెను సిరి అంటూ ప్రేక్షకులకి పరిచయం చేశాడు. ఇక తాజాగా కార్తీక్ సోషల్ మీడియాలో తన పెళ్లి వీడియోని పోస్ట్ చేశాడు.తెలంగాణ, మొయినా బాద్ లో ఉన్న రాయల్ లీషా కన్వెన్షన్స్ లో ఇతని వివాహం ఘనంగా జరిగింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నుండి ఈ వీడియోలో చూపించడం జరిగింది.
సాయి ఈవెంట్స్ వారు కెవ్వు కార్తీక్ పెళ్లి మండపం డిజైన్స్ తో పాటు మిగిలిన ఏర్పాట్లు అన్నీ అందంగా చేసినట్టు కెవ్వు కార్తీ ఈ వీడియో చివర్లో చెప్పుకొచ్చాడు. అతని అత్తమామలు కళ్ళు కడగడం వంటివి కూడా ఇందులో చూడొచ్చు. వీడియో చివర్లో కార్తీక్ తన భార్యతో కలిసి అందరి బ్లెస్సింగ్స్ కోరుకోవడం జరిగింది. ఈ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!