KGF Chapter 2 Collections: రికార్డ్ సృష్టించిన ‘కె.జి.ఎఫ్2’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • April 15, 2022 / 01:53 PM IST

2018 వ సంవత్సరం చివర్లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న(నిన్న) విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రాకింగ్ స్టార్ యష్ ను.. దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన విధానానికి అంతా ఫిదా అయిపోయారు. టీజర్, ట్రైలర్ లకి తగ్గట్టుగానే సినిమా ఉంది.

Click Here To Watch NOW

దీంతో మొదటి రోజు కలెక్షన్లు అదిరిపోయాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 9.60 cr
సీడెడ్ 2.80 cr
ఉత్తరాంధ్ర 1.70 cr
ఈస్ట్ 1.17 cr
వెస్ట్ 0.84 cr
గుంటూరు 1.10 cr
కృష్ణా 0.90 cr
నెల్లూరు 0.48 cr
రెస్ట్ 0.46 cr (తెలుగు వెర్షన్)
ఏపీ + తెలంగాణ (టోటల్) 19.05 cr

‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.19.05 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది. తెలుగులో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు మరో రూ.55.95 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇది ఈజీ టార్గెట్ అయితే కాదు.

కానీ సినిమాకి హిట్ టాక్ రావడం 2వ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరగడం పైగా వీకెండ్ అడ్వాంటేజ్ కూడా ఉండడంతో.. వీకెండ్ పూర్తయ్యేసరికి 75 శాతం రికవరీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఆ ఫీట్ ను ‘కె.జి.ఎఫ్2’ సాధిస్తుందో లేదో..!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus