‘కేజీఎఫ్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు యష్. ప్రస్తుతం ఈ హీరో తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లాడు. నిజజీవితంలో యష్ తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిస్తాడు. తన భార్య, పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి చూస్తుంటాడు. ఈ క్రమంలో రీసెంట్ గా తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. భార్య, తన ఇద్దరు పిల్లలతో అందమైన ప్రదేశాలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ”ఒకవేళ స్వర్గమంటూ ఉందని చెప్పుకుంటే అది ఇలాగే ఉంటుందేమో.
మేము ఇప్పుడు అక్కడే ఉన్నాం” అంటూ రాసుకొచ్చాడు. యష్ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం యష్ ‘కేజీఎఫ్’కి సీక్వెల్ గా వస్తోన్న ‘కేజీఎఫ్2’లో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ తారలు రవీనా టాండన్, సంజయ్ దత్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
1
2
3
4
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!