RRR, KGF2: హిందీలో మొదటి రోజు ‘కె.జి.ఎఫ్2’ ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

  • April 12, 2022 / 06:25 PM IST

‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ ఎటువంటి చప్పుడు చేయకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. కన్నడ సినిమాలకు ఈ రేంజ్ స్టామినా ఉందా అంటూ అంతా ఆశ్చర్యపోయేలా చేసింది.దర్శకుడు ప్రశాంత్ నీల్, అలాగే హీరో యష్ లు ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. ఇక ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ సూపర్ హిట్ అవ్వడంతో ‘కె.జి.ఎఫ్2’ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఈ చిత్రం పై కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా చరిత్ర సృష్టించింది ఈ చిత్రం. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు ‘కె.జి.ఎఫ్2’ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు అని బుకింగ్స్ చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ చిత్రం షారుఖ్ ఖాన్ వంటి పెద్ద హీరో నటించిన ‘జీరో’ పక్కన రిలీజ్ అయినా అక్కడ భారీ వసూళ్ళను రాబట్టింది. ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ 2’ పక్కన పెద్ద సినిమాలు ఏమీ లేవు. అందుకే ఈ చిత్రానికి అక్కడ బుకింగ్స్ అదిరిపోతున్నాయి.

మొదటి రోజుకి గాను నార్త్ లో ‘కె.జి.ఎఫ్2’ కి 60 శాతం పైనే బుకింగ్స్ జరిగాయి. ముఖ్యంగా అక్కడి మాస్ సెంటర్స్ లో ఓ రేంజ్లో బుక్ అవుతున్నాయి. సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ మూవీలో నటించడం బాలీవుడ్ జనాల్ని మరింతగా ఆకర్షిస్తుంది.దీంతో మొదటి రోజు అక్కడ భారీ కలెక్షన్లు నమోదు కావడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ‘కె.జి.ఎఫ్2’ అక్కడ మొదటి రాజు రూ.35 కోట్ల నుండీ రూ.40 కోట్ల నెట్ ను సాధించొచ్చు అనేది అంచనా.

అలా జరిగితే మన ‘ఆర్.ఆర్.ఆర్’ మొదటి రోజు కలెక్షన్లను ‘కె.జి.ఎఫ్’ అధిగమించినట్టే. ‘ఆర్.ఆర్.ఆర్’ మొదటి రోజు హిందీ నెట్ రూ.20 కోట్లు మాత్రమే..! అయితే హిట్ టాక్ వస్తేనే అక్కడ ‘కె.జి.ఎఫ్2’ దూకుడు కొనసాగుతుంది. లేదంటే అక్కడి జనాలకి మన ‘ఆర్.ఆర్.ఆర్’ అనే ఆప్షన్ ఇంకా ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus