బాలీవుడ్ అర్జున్ రెడ్డి రీమేక్ లో కైరా అద్వానీ

  • September 25, 2018 / 12:30 PM IST

తెలుగులో ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన “అర్జున్‌రెడ్డి’ సినిమాను తమిళంలో బాల దర్శకత్వంలో “వర్మ”గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే.. హిందీలో మాత్రం “అర్జున్ రెడ్డి” రీమేక్ కు తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహించిననున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంలో మాత్రం నిన్నమొన్నటివరకూ చిన్న కన్ఫ్యూజన్ నెలకొని ఉండేది. ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లు తప్పుకోవడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయంలో ఇవాల్టికి క్లారిటీ వచ్చింది.

సినిమా ప్రారంభం కాకముందే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది తారా సుతానియా. తెలుగు “అర్జున్‌రెడ్డి” సినిమాలోనే ఘాటైన ముద్దు సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. దాంతో ఆల్రెడీ లస్ట్ స్టోరీస్ తో సెక్సీ ఇమేజ్ సొంతం చేసుకొన్న కైరా అద్వానీ ఆ రోల్ కి పర్ఫెక్ట్ అని భావించిన సందీప్ రెడ్డి వంగా కైరాను కథానాయికగా ఫైనల్ చేశారు. షాహిద్, కైరా అద్వాణీ మధ్య ఘాటైన కెమెస్ట్రీ చూసేందుకు యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ప్రీతి పాత్రను కైరా ఏమేరకు న్యాయం చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus