సూపర్ స్టార్ సరసన నటించే అవకాశం అద్వానీ సొంతం

  • August 8, 2018 / 06:06 AM IST

“భరత్ అనే నేను”తో తెలుగులో వండర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల విడుదలైన “లస్ట్ స్టోరీస్” విడుదల అనంతరం ఆమె పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ తో ఒక సినిమా, బాలీవుడ్ లో కరణ్ జోహార్ బ్యానర్ లో మరో సినిమా సైన్ చేసిన కైరాకి ఇప్పుడో క్రేజీ ఆఫర్ వచ్చింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ఆల్రెడీ “తేరీ, మెర్సల్” చిత్రాలతో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అందుకొన్న అట్లీ దర్శకత్వంలో విజయ్ ముచ్చటగా మూడో సినిమా విషయం తెలిసిందే.

కోలీవుడ్ లో ప్రెజంట్ క్రేజీయస్ట్ అప్ కమింగ్ ప్రోజెక్ట్స్ లో ఒకటైన విజయ్-అట్లీ సినిమా కోసం కథానాయికగా కైరాను సంప్రదించారని, తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం కావడంతో మరో ఆలోచన లేకుండా కైరా అంగీకరించిందట. ఈ ప్రొజెక్ట్ గనుక వర్కవుట్ అయితే.. కైరా మళ్ళీ బాలీవుడ్ వైపు కూడా చూడాల్సిన అవసరం లేకుండా వరుస ఆఫర్లతో బిజీ అయిపోవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus