అక్షయ్ కుమార్ తో కైరా రొమాన్స్..?

  • March 7, 2019 / 03:27 PM IST

మహేష్‌ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఆకర్షించింది కైరా అద్వానీ. ఈ చిత్రంలో తన గ్లామర్ తో పాటూ నటనతో కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రం తరువాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘వినయ విధేయ రామా’ చిత్రంలో కూడా ఛాన్సు కొట్టేసింది. ఇక అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరేకేక్కబోయే చిత్రంలోనూ అలాగే ‘మహేష్ 26’ లో కూడా హీరోయిన్ గా కైరా అద్వానీ పేరు పరిశీలనలో ఉందని టాక్ నడుస్తుంది. టాలీవుడ్ లో పాటూ బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్న కైరా అద్వానీ.. గురించి ఓ ఆసక్తి కరమైన వార్త ఒకటి బయటకొచ్చింది.

వివరాల్లోకి వెళితే.. రాఘవ లారెన్స్‌ డైరెక్షన్లో ‘కాంచన’ హిందీ రీమెక్‌ రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కైరా నటించబోతుందట. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించబోతున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందట. కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని చేయడానికి అక్షయ్ కుమార్ ఓకే చెప్పేశాడట. కైరా అద్వానీ కూడా ఈ చిత్రం చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందట. ప్రస్తుతం ‘కబీర్ సింగ్’ చిత్రంతో కైరా, అలాగే ‘కాంచన 3’ చిత్రంతో రాఘవ లారెన్స్ బిజీగా ఉన్నారు. ఇక అక్షయ్ కుమార్ అయితే మూడు, నాలుగు ప్రాజెక్టులు చేస్తున్నాడట. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus